'నా బాధ్యతల పట్ల సంతోషంగా ఉన్నా'

14 Feb, 2017 11:59 IST|Sakshi

హైదరాబాద్:బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తరపున మూడు రకాల పాత్రలు నిర్వర్తించడం పట్ల కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఆనందం వ్యక్తం చేశాడు. అటు కెప్టెన్ గానే కాకుండా, ఇటు బ్యాట్స్మన్ గా, వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. 2011 నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) తనపై నమ్మకం ఉంచి పలు రకాల బాధ్యతలు అప్పజెప్పడం పట్ల ముష్పికర్ కృతజ్ఞతలు తెలియజేశాడు. సుదీర్ఘకాలంగా బంగ్లాదేశ్ క్రికెట్ లో కీలక పాత్రలు నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉందన్నాడు.

'నాకు అప్పజెప్పిన పాత్రలతో ఆనందంగా ఉన్నా. బ్యాట్స్మన్ గా నా యావరేజ్ 33 నుంచి 34 మాత్రమే ఉంది. అటు వంటప్పుడు బంగ్లాదేశ్ కు నంబర్ వన్ బ్యాట్స్మన్ ను ఎలా అవుతాను?, నీ దగ్గర పలు రకాల బాధ్యతలను నిర్వర్తించే ప్రతిభ ఉంటే, అప్పుడు మేనేజ్మెంటే కచ్చితంగా నీపై నమ్మకం ఉంచుతుంది. అది కూడా ఆ బాధ్యతలను సరిగా నిర్వర్తించినప్పుడు ఎక్కువ కాలం బోర్డు నమ్మకాన్ని పొందుతాం. కాని పక్షంలో బోర్డు తీసుకుని ఏ నిర్ణయానికైనా బాధ్యత వహించక తప్పదు.ప్రస్తుతం నాకు అప్పజెప్పిన బాధ్యతలను ఎంజాయ్ చేస్తూ నిర్వర్తిస్తున్నా. జట్టుతో పాటు ఉంటూ సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపటాన్ని ఇష్టపడుతున్నా. కెప్టెన్నీ అనేది నా చేతుల్లో లేదు. ఒకవేళ నన్ను కెప్టెన్ ఉంచాలన్నా, తీసేయాలన్నా మా బోర్డు నిర్ణయంపై ఆధారపడుతుంది'అని ముష్ఫికర్ తెలిపాడు.

మరిన్ని వార్తలు