దుమ్మురేపిన ఆసీస్

3 Aug, 2013 01:28 IST|Sakshi
దుమ్మురేపిన ఆసీస్

మాంచెస్టర్: యాషెస్ సిరీస్‌లో బ్యాటిం గ్ వైఫల్యంతో ఇబ్బందులుపడుతు న్న ఆస్ట్రేలియా జట్టు ఎట్టకేలకు గాడి లో పడింది. కెప్టెన్ క్లార్క్ (314 బం తుల్లో 187; 23 ఫోర్లు) ముందుండి జట్టును నడిపించడంతో మిడిలార్డర్‌లో స్మిత్ (196 బంతుల్లో 89; 8 ఫోర్లు), హాడిన్ (99 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు), స్టార్క్ (71 బంతుల్లో 66 నాటౌట్; 9 ఫోర్లు) పరుగుల వరద పారించారు. దీంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో గురువారం రెండో రోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 146 ఓవర్లలో 7 వికెట్లకు 527 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో 2 వికెట్లకు 52 పరుగులు చేసింది. కుక్ (36), ట్రాట్ (2) క్రీజులో ఉన్నారు. రూట్ (8), బ్రెస్నన్ (1) అవుటయ్యారు. ఈ రెండు వికెట్లు సిడిల్‌కు దక్కాయి. అంతకుముందు 303/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ నెమ్మదిగా ఆడింది. క్లార్క్ రెండు కీలక భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.
 
  స్మిత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 214 పరుగులు, హాడిన్‌తో కలిసి ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. వార్నర్ (5) నిరాశపరిచాడు. చివర్లో హాడిన్, స్టార్క్‌లు ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 97 పరుగులు జోడించడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. స్వాన్ 5, బ్రాడ్, బ్రెస్నన్ చెరో వికెట్ తీశారు.
 
 క్రికెట్ చరిత్రలోనే డేవిడ్ వార్నర్ అత్యంత చెత్త రిఫరల్ అడిగాడు. స్వాన్ బౌలింగ్‌లో స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. స్పష్టంగా అవుటైనట్లు తెలుస్తున్నా రివ్యూకు వెళ్లి అభాసుపాలయ్యాడు.
 
 

మరిన్ని వార్తలు