పంజాబ్‌లో మిల్కా విగ్రహం

20 Nov, 2013 01:19 IST|Sakshi
పంజాబ్‌లో మిల్కా విగ్రహం

చండీగఢ్: భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ విగ్రహం లూథియానాలో రూపుదిద్దుకుంటోంది. యువత క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఈ విగ్రహం స్ఫూర్తినిస్తుందని ఫ్లయింగ్ సిఖ్ మిల్కా చెప్పారు. లూథియానాకు సమీప గ్రామమైన జార్ఖర్‌లో 28 అడుగుల ఎత్తై విగ్రహాన్ని నిర్మిస్తున్నారు.
 
 ఒక స్పోర్ట్స్ అకాడమీ రూ. 7.5లక్షల వ్యయంతో ఈ ప్రతిమను నెలకొల్పుతోంది. డిసెంబర్ నెలాఖరుకల్లా దీని నిర్మాణం పూర్తవుతుందని ఆ అకాడమీ తెలిపింది. ‘గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రీడలకు ప్రాచుర్యం కల్పించేందుకు, బాలలు, యువత క్రీడల్లో రాణించేందుకు ఇది ప్రేరణగా నిలువనుంది’ అని మిల్కాసింగ్ అన్నారు.
 

మరిన్ని వార్తలు