‘మాకు వీడియో ప్రూఫ్‌ కావాలి’

19 Jan, 2020 19:33 IST|Sakshi

బెంగళూరు: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) తన అధికారిక ట్విటర్‌లో చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. బెంగళూరు వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ సందర్భంగా టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రిత్‌ బుమ్రా బౌలింగ్‌ చేస్తున్న సమయంలో స్టేడియంలోని ఓ అభిమాని ‘నేను బుమ్రాలా బౌలింగ్‌ చేయగలను’ అంటూ ఓ ఫ్లకార్డ్‌ పట్టుకున్నాడు. దీనిని కాప్చర్‌ చేసిన ఐసీసీ.. ఆ ఫోటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ ‘మేము వీడియో ప్రూఫ్‌ చూడాలనుకుంటున్నాం’ అంటూ క్యాప్షన్‌గా పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఫోటోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇక జస్ప్రిత్‌ బుమ్రా బౌలింగ్‌ శైలి విభిన్నంగా, యూనిక్‌గా ఉంటుంది. అందుకే అతడి బౌలింగ్‌ శైలికి అందరూ ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా అతనిలా బౌలింగ్‌ చేయడానికి ఇష్టపడుతున్నారు. డెత్‌ ఓవర్లలో యార్కర్ల కింగ్‌గా పేరుగాంచిన బుమ్రా అతి తక్కువ కాలంలోనే టీమిండియా ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం వన్డేల్లో నంబర్‌ వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ సిరీస్‌లకు దూరమై ఆస్ట్రేలియా సిరీస్‌తో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. ఇక పునరాగమనంలో అంతగా వికెట్లు సాధించనప్పటికీ పరుగులు ఇవ్వకుండా ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. 
 

చదవండి:
కోహ్లి క్యాచ్‌.. లబుషేన్‌ షాక్! 
కోహ్లి, డివిలియర్స్‌ల తర్వాత రోహితే

మరిన్ని వార్తలు