‘అందుకే కోహ్లిని అలా పిలిచేది’

19 Jan, 2020 20:48 IST|Sakshi

బెంగళూరు: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి మరో మైలురాయిని అందుకున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 39 ఓవర్‌లో సింగిల్‌ తీయడంతో ఛేదనలో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7000 పరుగులు పూర్తిచేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లి(133 ఇన్నింగ్స్‌ల్లో) రికార్డు నెలకొల్పాడు. ఇక ఛేజింగ్‌లో ఏడు వేలు అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 232 ఇన్నింగ్స్‌ల్లో 8720 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. 

ఇక పరుగుల ఛేదనలో కోహ్లిని కింగ్‌గా ఫ్యాన్స్‌ అభివర్ణించే విషయం తెలిసిందే. ఛేజింగ్‌లోనే కోహ్లి ఇప్పటివరకు 22 సెంచరీలు సాధించడం విశేషం. అంతేకాకుండా 2009 నుంచి 2019 మధ్య కాలంలో టీమిండియా 300కు పైగా పరుగుల లక్ష్యాన్ని 10 సార్లు ఛేదించింది. ఇందులో కోహ్లి ఏడు శతకాలు నమోదు చేశాడంటే అర్థమవుతుంది అతడు ఛేజింగ్‌కా బాప్‌ అని. ఇక ఛేదనలో కోహ్లి యావరేజ్‌ 69కి పైగా ఉండటం మరోవిశేషం. 

>
మరిన్ని వార్తలు