‘ఆ చాన్స్‌ టీమిండియాకు ఇవ్వం’

13 Jan, 2020 12:46 IST|Sakshi

ముంబై: టీమిండియాతో జరుగనున్న మూడు వన్డేల సిరీస్‌ను తమ జట్టు గెలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌ను ఆసీస్‌ 2-1తేడాతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌కు వారి దేశంలో సిరీస్‌ గెలిచే అవకాశాన్ని ఆసీస్ ఈసారి కూడా ఇవ్వదని జోస్యం చెప్పాడు. భారత్‌లో వారి గడ్డపై గతేడాది జరిగిన వన్డే సిరీస్‌లో తమదే పైచేయి అయ్యిందని, ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందన్నాడు. (ఇక్కడ చదవండి: స్టీవ్‌ స్మిత్‌ ఆర్డర్‌ మారనుంది..)

టీమిండియాకు ప్రతీకారం తీర్చుకునే చాన్స్‌ ఇవ్వబోమన్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ దగ్గర్నుంచీ ఆసీస్‌ క్రమేపీ పుంజుకుందన్నాడు. పాకిస్తాన్‌, న్యూజిలాండ్ జట్లను వైట్‌వైష్‌ చేసిన ఆసీస్‌.. ఇప్పుడు భారత్‌పై అదే తరహా ప్రదర్శనను రిపీట్‌ చేయడానికి సిద్ధమైందన్నాడు. ట్వీటర్‌లో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్స్‌లో భాగంగా భారత్‌పై ఆసీస్‌ గెలుస్తుందా అనే ప్రశ్నకు పాంటింగ్‌ పై విధంగా స్పందించాడు. ఇక టెస్టు ఫార్మాట్‌లో దుమ్మురేపి ఆసీస్‌ జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయిన లబూషేన్‌ గురించి మాట్లాడుతూ.. ‘ ఆసీస్‌కు లబూషేన్‌ ఒక వెన్నుముకలా మారిపోయాడు. ప్రత్యేకంగా మిడిల్‌ ఆర్డర్‌లో జట్టు పటిష్టం కావడానికి లబూషేన్‌ ఒక కారణం. స్పిన్‌ బాగా ఆడే లబూషేన్‌ భారత్‌పై కచ్చితంగా రాణిస్తాడు’ అని పాంటింగ్‌ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. 2019 ఫిబ్రవరి-మార్చి నెలలో ఆసీస్‌ జట్టు భారత్‌లో పర్యటించింది. రెండు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఆసీస్‌.. ఐదు వన్డేల సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది.

>
మరిన్ని వార్తలు