టాస్‌ ఓడినా.. అనుకున్నదే లభించింది

14 Nov, 2019 09:20 IST|Sakshi

ఇండోర్‌ : రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా స్థానిక హోల్కర్‌ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ కష్టతరంగా ఉంటుందనే ఉద్దేశంతో తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నట్లు బంగ్లా సారథి మోమినుల్‌ హక్‌ తెలిపాడు. ఇక ఒకవేళ టాస్‌ గెలిస్తే  ఏ మాత్రం ఆలోచించకుండా తొలుత బౌలింగ్‌ ఎంచుకునేవాడినని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. పిచ్‌ తొలి రోజు సీమర్లకు అనుకూలించే అవకాశం ఉందని, ఆ తర్వాత పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. దీంతో టాస్‌తోనే మ్యాచ్‌పై ఉత్కంఠ కలిగింది. ఇక ముందుగా ఊహించినట్టే రాంచీ టెస్టులో ఆడిన తుది జట్టు నుంచి ఒకే ఒక్క మార్పుతో భారత్‌ బరిలోకి దిగుతోంది. నాటి మ్యాచ్‌లో ఆడిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ స్థానంలో ఇషాంత్‌ శర్మను జట్టులోకి తీసుకున్నారు. 

ఇప్పటికే టీ20 సిరీస్‌ కైవసం చేసుకుని రెట్టింపు ఉత్సాహంలో ఉన్న టీమిండియా టెస్టు సిరీస్‌లోనూ బంగ్లా పని పట్టాలని భావిస్తోంది. అదేవిధంగా ప్రపంచటెస్టు చాంపియన్‌ షిప్‌లో ఇప్పటివరకు ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో ఉన్న టీమిండియా.. ఈ సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్‌ మరిన్ని పాయింట్లను ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇక అన్ని విధాలుగా తనకన్న బలమైన టీమిండియాను బంగ్లా ఏ విధంగా ఎదుర్కుంటుందో వేచి చూడాలి.  


తుది జట్ల వివరాలు
భారత్‌: కోహ్లి (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, సాహా, జడేజా, అశ్విన్, ఇషాంత్, ఉమేశ్, షమీ.
బంగ్లాదేశ్‌: మోమినుల్‌ హక్‌ (కెప్టెన్), షాద్‌మన్, ఇమ్రుల్ కాయెస్, మిథున్, ముష్ఫికర్, మహ్ముదుల్లా, లిటన్‌ దాస్, మెహదీ హసన్, తైజుల్, అబూ జాయెద్, ఇబాదత్‌


భారత్ జట్టు 

బంగ్లాదేశ్‌ జట్టు 

మరిన్ని వార్తలు