రోహిత్‌ శర్మ @350

14 Nov, 2019 09:52 IST|Sakshi

ఇండోర్‌ :  టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ తన కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలవనుంది. ఈ మ్యాచ్‌ రోహిత్‌కు ఓవరాల్‌గా 350వ అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం. ఇప్పటివరకు టీమిండియా తరుపున 218 వన్డేలు, 101 టీ20లు, 30 టెస్టులు ఆడాడు. నేటి టెస్టుతో 350వ మార్క్‌ను అందుకున్నాడు. ఈ సందర్భంగా ఐసీసీ ట్వీట్‌ చేసింది. ‘నేడు రోహిత్‌ శర్మ 350వ మ్యాచ్‌ ఆడనున్నాడు. అతడికి సంబంధించిన మీ ఫేవరేట్‌ ఇన్నింగ్స్‌/సంఘటన ఏమిటి?’అంటూ అభిమానులను ఐసీసీ ప్రశ్నించింది. 

మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా టీమిండియాలో చోటుదక్కించుకున్న రోహిత్‌ ఓ మోస్తారుగా రాణించాడు. అయితే ఓపెనర్‌గా ప్రమోషన్‌ అందుకున్న తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు, వన్డేల్లో అత్యధిక వ‍్యక్తిగత పరుగుల రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకూ 31 టెస్టులు ఆడిన రోహిత్‌ 2114 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్‌ సెంచరీ, 6 శతకాలు, 10 హాప్‌ సెంచరీలు సాధించాడు. కాగా, 218 వన్డేల్లో 48.53 సగటుతో మూడు ద్వి శతకాలు, 27 సెంచరీలు, 42 అర్థ శతకాల సహాయంతో 8686 పరుగులు సాధించాడు. ఇక 101 టీ20 మ్యాచ్‌ల్లో 4 శతకాలు, 18 హాఫ్‌ సెంచరీలతో 2539 పరుగులు సాధించాడు.  
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా