మూడో టీ20: ఆసక్తికర విషయాలు మీకోసం!

29 Jan, 2020 12:31 IST|Sakshi

హామిల్టన్‌: ఒకరిది సిరీస్‌ కోసం పోరాటమైతే.. మరొకరిది పరువు కోసం ఆరాటం. టీమిండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20ల్లో ఇరుజట్ల పరిస్థితి విభిన్నం. వరుస విజయాలతో కోహ్లి సేన జోరుమీదుండగా.. స్వదేశంలో రెండు వరుస పరాజయాలతో కివీస్‌ సతమతమవుతోంది.  ఇక అచ్చొచ్చిన సెడాన్‌ పార్క్‌లో విజయ ఢంకా మోగించి ఓటములకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ఆతిథ్య జట్టు ఆరాటపడుతుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి తరువాతి రెండు మ్యాచ్‌ల్లో ప్రపంచకప్‌ సన్నాహకం కోసం ప్రయోగాలు చేయాలని పర్యాటక జట్టు ఆరాటపడుతోంది. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం


► టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ గత మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 
► 2019 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో కేఎల్‌ రాహుల్‌ కంటే ఎక్కువ అర్థ సెంచరీలు(7) ఏ బ్యాట్స్‌మన్‌ సాధించలేదు.
విరాట్‌ కోహ్లి నాయకత్వంలో టీమిండియా టీ20 ద్వైపాక్షిక సిరీస్‌ ఓడిపోలేదు
► 2019 ప్రపంచకప్‌ తర్వాత ఛేజింగ్‌లో టీమిండియా ఏ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు.
► టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ గత 10 టీ20ల్లో 6 మ్యాచ్‌ల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు.
► టీ20ల్లో న్యూజిలాండ్‌పై రోహిత్‌కు అంత ఘనమైన రికార్డు లేదు. కివీస్‌పై అతడి సగటు 22 మాత్రమే ఉండటం గమనార్హం.
► ఇక ఈ సిరీస్‌లో కివీస్‌ స్టార్‌ హిట్టర్‌ గ్రాండ్‌హోమ్‌ను రెండు సార్లు అవుట్‌ చేసింది రవీంద్ర జడేజానే
► ఈ సిరీస్‌లో బుమ్రా బౌలింగ్‌లో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ కేవలం రెండు ఫోర్లు, ఒక​ సిక్సర్‌ మాత్రమే సాధించారు 
► టీమిండియా గత రెండు మ్యాచ్‌లను సిక్సర్‌తోనే ముగించింది
► ఈ మైదానంలో కివీస్‌ 9 మ్యాచ్‌లు ఆడగా 7 గెలవడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం

చదవండి:
సెమీస్‌లో యువ భారత్‌

దగ్గరి దారులు వెతక్కండి!

>
మరిన్ని వార్తలు