టాస్‌ గెలిచిన కివీస్‌.. టీమిండియాదే బ్యాటింగ్‌

29 Jan, 2020 12:16 IST|Sakshi

హామిల్టన్‌ : అప్రతిహత విజయాలతో దూసుకపోతున్న టీమిండియా మరో సిరీస్‌పై కన్నేసింది. ఇప్పటికే రెండు విజయాలతో జోరుమీదున్న కోహ్లి సేన హామిల్టన్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కూడా సత్తా చాటి ఐదు టీ20ల సిరీస్‌ను  3-0తో కైవసం చేసుకోవాలనుకుంటుంది. బుధవారం ఆతిథ్య జట్టుకు అచ్చొచ్చిన సెడాన్‌ పార్క్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కివీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం కివీస్‌ ఒక్క మార్పు చేసింది. గత రెండు మ్యాచ్‌ల్లో అంతగా ప్రభావం చూపని పేస్‌ బౌలర్‌ టిక్‌నర్‌ స్థానంలో కుగ్‌లీన్‌ను జట్టులోకి తీసుకుంది. ఇక టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండానే విన్నింగ్‌ టీమ్‌తోనే బరిలోకి దిగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లనూ కివీస్‌ టాస్‌ గెలవడం గమనార్హం. 

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిస్తే తప్పక బౌలింగ్‌ ఎంచుకునేవాడినని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి తెలిపాడు. అయితే టాస్‌ గెలవడమనేది మన చేతుల్లో ఉండదన్నాడు. పిచ్ తొలుత బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందని, ఇక రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు మంచిగా ఈ పిచ్‌ సహకరించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే అద్భుత ప్రదర్శనతో పక్కాగా ప్రణాళికలు అమలు చేయాలని భావిస్తున్నామని అన్నాడు. ఇక ఈ సెడాన్‌ పార్క్‌లో ఇప్పటివరకు 9 టీ20 మ్యాచ్‌లు జరగగా.. నాలుగు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌, 5 మ్యాచ్‌ల్లో రెండో సారి బ్యాటింగ్‌ చేసిన జట్లు గెలుపొందాయి. మూడో టీ20లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని టీమిండియా.. తప్పక ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌తో పాటు పరువు నిలుపుకోవాలని ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టు ఆరాటపడుతోంది. మరి ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.   

తుదిజట్లు: 
భారత్‌: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, శివమ్‌ దుబె, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, చహల్‌, జస్ప్రిత్‌ బుమ్రా
న్యూజిలాండ్‌: కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), మార్టిన్‌ గప్టిల్‌, కోలిన్‌ మున్రో, రాస్‌ టేలర్‌, గ్రాండ్‌ హోమ్‌, సీఫెర్ట్‌, సాంట్నర్‌, సోధి, సౌతీ, బెన్నెట్‌, కుగ్‌లీన్‌

చదవండి:
దగ్గరి దారులు వెతక్కండి!

సెమీస్‌లో యువ భారత్‌

మరిన్ని వార్తలు