శ్రేయస్‌ అయ్యర్‌ శతక్కొట్టుడు

5 Feb, 2020 10:54 IST|Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆటగాడు శ్రేయస్‌ అ‍య్యర్‌ సెంచరీ బాదేశాడు. 101 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో శతకం కొట్టేశాడు. ఇది అయ్యర్‌కు తొలి వన్డే సెంచరీ.   అంతకుముందు మయాంక్‌ అగర్వాల్‌(32; 31 బంతుల్లో 6 ఫోర్లు) రెండో వికెట్‌గా ఔట్‌ కాగా, కోహ్లికి అయ్యర్‌ జత కలిశాడు. వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. ఫోర్ల కంటే కూడా సింగిల్స్‌, డబుల్స్‌పైనే దృష్టి పెట్టి రన్‌రేట్‌ కాపాడుకుంటూ వచ్చారు. కాగా, ఊహించని బంతిని సోథీ వేయడంతో కోహ్లి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ తరుణంలో అయ్యర్‌- కేఎల్‌ రాహుల్‌ల జోడి అత్యంత సమన్వయంగా బ్యాటింగ్‌ చేసింది.

మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే చెత్త బంతులను బౌండరీలు దాటించారు. ప్రధానంగా రాహుల్‌ దూకుడుగా ఆడగా, అయ్యర్‌ మాత్రం నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాడు. ఈ క‍్రమంలోనే 40 బంతుల్లో నాలుగు సిక్స్‌లతో రాహుల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికి అయ్యర్‌ తన వన్డే కెరీర్‌లో మెయిడిన్‌ సెంచరీతో మెరిశాడు. ముందుగా 66 బంతుల్లో 5 ఫోర్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్న అయ్యర్‌.. మరో 35 బంతుల్లో హాఫ్‌ సెంచరీని సెంచరీగా మలుచుకున్నాడు. (ఇక్కడ చదవండి: ఇద్దరికీ అరంగేట్రపు వన్డే.. కానీ)

తొలి వికెట్‌కు పృథ్వీ షా(20) ఔట్‌ కాగా, రెండో వికెట్‌గా  మయాంక్‌ అగర్వాల్‌(32; 31 బంతుల్లో 6 ఫోర్లు)  పెవిలియన్‌ చేరాడు. ఓపెనర్‌ పృథ్వీషా(20) ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి సమయోచితంగా బ్యాటింగ్‌ చేసి అర్థ శతకం నమోదు చేశాడు. 61 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి 102 పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లి నెలకొల్పాడు. ఈ క్రమంలోనే అర్థ శతకంతో మెరిశాడు. కాగా, హాఫ్‌ సెంచరీ చేసిన వెంటనే కోహ్లి పెవిలియన్‌ చేరాడు. ఇష్‌ సోథీ వేసిన 29 ఓవర్‌ నాల్గో బంతికి కోహ్లి బౌల్డ్‌ అయ్యాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతి కోహ్లి బ్యాట్‌ను దాటుకుని వెళ్లి వికెట్లను తాకింది.   దాంతో భారత స్కోరు 156 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో రాహుల్‌-శ్రేయస్‌ అ‍య్యర్‌ల జోడి సెంచరీకి పైగా భాగస్వామ్యాన్ని సాధించింది. 

మరిన్ని వార్తలు