సిరీస్‌ ఓటమిపై కోహ్లి ఏమన్నాడంటే?

11 Feb, 2020 20:43 IST|Sakshi

మౌంట్‌ మాంగనీ : టీ20 సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా వన్డే సిరీస్‌లో చతికిలపడింది. భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 0-3తో క్లీన్‌స్వీప్‌ చేసి న్యూజిలాండ్‌ ప్రతీకారం తీర్చుకుంది. వన్డే సిరీస్‌లో పూర్తిగా తేలిపోయిన కోహ్లి అండ్‌ గ్యాంగ్‌ 31 ఏళ్ల తర్వాత వైట్‌ వాష్‌కు గరవడం గమనార్హం. ఈ సిరీస్‌లో ముఖ్యంగా బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో తేలిపోయి ఘోర ఓటమిని టీమిండియా మూటగట్టుకుంది. ఇక గెలిచేందుకు అవకాశాల లభించినా అందిపుచుకోక ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో కివీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఆటగాళ్ల ప్రదర్శనపై టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో కోహ్లి మాట్లాడాడు. 

‘ఈ సిరీస్‌లో మా స్కోర్లను చూస్తుంటే మరీ చెత్తగా ఆడామని చెప్పలేం. కానీ అవకాశాలను అందిపుచ్చుకోలేదు. అందువల్లే సిరీస్‌ ఓడిపోయాం. అంతర్జాతీయ మ్యాచ్‌లు గెలవాలంటే ఈ సిరీస్‌లో మేం చూపించిన ఈ పోటీతత్వం సరిపోదు. బౌలింగ్‌లో అంతగా మెరపులు లేవు. బంతిని తిప్పలేదు, ఫీల్డింగ్‌లో చురుకుదనం లేదు. అయితే మేము మరింత చెత్తగా ఆడలేదు.. కానీ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. అలాంటప్పుడు గెలిచే అర్హత ఉండదు. కఠిన పరిస్థితుల్లో బ్యాట్స్‌మెన్‌ పరుగులు సాధించడం టీమిండియాకు సానుకూలాంశం. అయితే బౌలింగ్‌, ఫీల్డింగ్‌ టీమిండియా కొంప ముంచింది. టీ20 సిరీస్‌ ఓటమి తర్వాత న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌లో మరింత కసిగా ఆడింది. అయితే మేము అంతే పట్టుదల, కసిగా ఆడలేదు. పట్టు విదిల్చాం. ఇక టెస్టు చాంపియన్‌ షిప్‌లో ప్రతీ మ్యాచ్‌ కీలకం. అయితే సుదీర్ఘ ఫార్మట్‌లో మనకు మంచి జట్టు ఉంది. దీంతో మనం టెస్టు సిరీస్‌ కచ్చితంగా గెలవగలం. అయితే సరైన ప్రణాళిక, మానసికంగా ధృఢంగా ఆడాలి’అంటూ కోహ్లి వ్యాఖ్యానించాడు. 

చదవండి:
‘క్రికెట్‌ దేవుడిని మరోసారి గెలిపించండి’

‘కాగితం, కత్తెర, బండ?’

>
మరిన్ని వార్తలు