రెండో టీ20: ఇవి మీకు తెలుసా?

26 Jan, 2020 12:50 IST|Sakshi

ఆక్లాండ్‌: హాలిడే అయిన ఆదివారం రోజు ఫుల్‌ వినోదాన్ని అందించేందుకు టీమిండియా-న్యూజిలాండ్‌ జట్లు సిద్దమయ్యాయి. ఆక్లాండ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు గెలుపు కోసం పోటాపోటీగా పోటీపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే టాస్‌ ఓడిపోయినా తాము అనుకున్నదే దక్కిందని సారథి కోహ్లి పేర్కొనడం విశేషం. కాగా, విన్నింగ్‌ టీమ్‌నే కొనసాగించాలనే ఉద్దేశంతో రెండో టీ20 కోసం ఇరుజట్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.  అయితే భారత్‌-కివీస్‌ రెండో టీ20 సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

  • ఇప్పటివరకు టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌లు న్యూజిలాండ్‌పై గెలవలేదు.
  • న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ మైదానం టీమిండియాకు అచ్చొచ్చిన మైదానం. ఎందుకుంటే ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ విజయం సాధించింది.
  • కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం కివీస్‌ జట్టుకు కలిసిరాదు. ఎందుకంటే ఆడిన 20 మ్యాచ్‌ల్లో ఆ జట్టు 13 మ్యాచ్‌ల్లో అక్కడ ఓడిపోయింది.  
  • న్యూజిలాండ్‌ స్టార్‌ అండ్‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ 2014 తర్వాత టీ20ల్లో తొలి హాఫ్‌ సెంచరీ సాధించాడు. టీమిండియాతో జరిగిన తొలి టీ20 సందర్భంగా టేలర్‌ అర్థసెంచరీ సాధించిన విషయం తెలిసిందే. 
  • గత 10 టీ20 ఇన్నింగ్స్‌లో టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఏడు సార్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవ్వడం గమనార్హం. అంతేకాకుండా రోహిత్‌ తన కెరీర్‌లో 50 శాతానికిపైగా మ్యాచ్‌ల్లో పది బంతుల్లోపే ఔటయ్యాడు. 
  • కివీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ కోలిన్‌ మున్రో 2017 నుంచి ప్లవర్‌ ప్లేలో 165కు పైగా స్ట్రయిక్‌ రేట్‌ నమోదు చేస్తుండటం విశేషం. 
  • టీ20ల్లో కివీస్‌ స్పిన్నర్‌ ఇష్‌ సోధి టీమిండియాపై ఇప్పటివరకు 13 వికెట్లు దక్కించుకున్నాడు. 

చదవండి: 
ఓడినా.. కోరుకున్నదే దక్కింది 

మరిన్ని వార్తలు