వాటే డైవ్‌.. పిచ్చెక్కించావ్‌ కదా!

29 Feb, 2020 15:56 IST|Sakshi

క్రిస్ట్‌చర్చ్‌: టీమిండియాతో రెండో టెస్టులో న్యూజిలాండ్‌ పైచేయి సాధించింది. తొలి రోజు ఆటలోనే టీమిండియా ఆలౌట్‌ చేసిన న్యూజిలాండ్‌.. ఆపై ఆట ముగిసే సమయానికి వికెట్‌ కోల్పోకుండా 63 పరుగులు చేసింది. 63 ఓవర్లలో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను చుట్టేసిన కివీస్‌.. ఆపై 23 ఓవర్లు ఆడి వికెట్‌ను కూడా ఇవ్వలేదు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా(54), చతేశ్వర పుజారా(54), హనుమ విహారి(55)లు మినహా ఎవరూ రాణించలేదు. కాగా, భారత్‌ ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న టామ్‌ లాథమ్‌ అందుకున్న తీరు మ్యాచ్‌కే హైలైట్‌ అయ్యింది.(కెప్టెన్‌ అయినంత మాత్రాన అలా చేస్తావా?)

భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా జెమీసన్‌ వేసిన 20 ఓవర్‌ తొలి బంతిని వేశాడు. దాన్ని థర్డ్‌ మ్యాన్‌ దిశగా భారీ షాట్‌ ఆడేందుకు పృథ్వీ షా యత్నించాడు. అది కాస్తా ఎడ్జ్‌ తీసుకోవడంతో స్లిప్‌ పైనుంచి దారి తీసుకుంది. కాగా, సెకండ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న లాథమ్‌ గాల్లో అత్యద్భుతమైన డైవ్‌తో క్యాచ్‌ను పట్టేశాడు. దాంతో పృథ్వీ షా మ్యాజిక్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. కాకపోతే లాథమ్‌ క్యాచ్‌ను అందుకున్న తీరు మాత్రం నిజంగా అమోఘం. ఆ బలమైన షాట్‌ను అంతా ఫోర్‌ అనుకున్న తరుణంలో లాథమ్‌ సూపర్‌ మ్యాన్‌ తరహాలో ఎగిరి మరీ పృథ్వీ షాను షాక్‌కు గురి చేశాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. (టీమిండియాను ఆడేసుకుంటున్నారు..)

మరిన్ని వార్తలు