టీ20 సిరీస్‌: ‘4’,‘6’లను కూడా అనుమతించం

4 Jan, 2020 13:54 IST|Sakshi

గుహవాటి: అంతర్జాతీయ స్థాయిలో ఏ మ్యాచ్‌ జరుగుతున్నా ప్లకార్డులతో అభిమానులు స్టేడియాలకి వెళ్లడం సర్వసాధారణం. అది క్రికెట్‌ మ్యాచ్‌ కావొచ్చు.. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కావొచ్చు.  ఇక్కడ అభిమానులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆటను ఆస్వాదిస్తూ ఉంటారు. కాగా, టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం బార్సపారా క్రికెట్‌ స్టేడియంలో ప్లకార్డులపై నిషేధం విధిస్తూ అసోం క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌ సమయంలో ఏ విధమైన ప్లకార్డులు ప్రదర్శించకూడదనే ఆదేశాలు జారీ చేసింది.  చివరకు ఫోర్‌, సిక్స్‌ ప్లకార్డులను సైతం బ్యాన్‌ చేసినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ టీమిండియా-శ్రీలంకల మధ్య ఇక్కడ తొలి మ్యాచ్‌లో భాగంగా స్టేడియం లోపలికి ఏ విధమైన ప్లకార్డులు తీసుకెళ్లడానికి అనుమతి లేదు.(ఇక్కడ చదవండి: రోహిత్‌ లేడు.. ఇక ఆ రికార్డు కోహ్లిదే!)

ఫోర్‌, సిక్స్‌ ప్లకార్డులను కూడా తీసుకు రావొద్దు. ఇలా ప్లకార్డుల ప్రదర్శంచడం గందరగోళానికి దారి తీస్తోంది.  ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు తమ ప్రకటనలకు కోసం ప్లకార్డులను తయారు చేసి వారి ప్రచారానికి వాడుకుంటున్నాయి. సదరు కంపెనీలు తయారు చేసిన ప్లకార్డులను అభిమానులు స్టేడియాల్లోకి తీసుకొచ్చి వాటిని ప్రదర్శిస్తున్నారు. దాంతోనే ప్లకార్డులతో పాటు బ్యానర్లను కూడా నిషేధిస్తున్నాం. మార్కర్‌ పెన్స్‌కు కూడా అనుమతి లేదు. కేవలం పురుషుల వాలెట్లు, మహిళల హ్యాండ్‌ బ్యాగ్స్‌, మొబైల్‌ ఫోన్స్‌, అభిమానుల వాహనాల తాళాలు మాత్రమే స్టేడియం లోపలకి తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని అభిమానులు స్టేడియానికి రావాలి’ అని అసోం క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ దేవజిత్‌ సైకియా తెలిపారు.

మరిన్ని వార్తలు