కోహ్లి కాదు శివమ్‌ దూబే..

8 Dec, 2019 19:37 IST|Sakshi

తిరువనంతపురం : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. విలియమ్స్‌ బౌలింగ్‌లో సారథి విరాట్‌ కోహ్లి(19) ఔటయ్యాడు. విలియమ్స్‌ వేసిన ఔట్‌సైడ్‌ ఆఫ్‌ స్లో షార్ట్‌ పిచ్‌ బంతిని ఆడటంలో కోహ్లి తడబడ్డాడు. స్లో షాట్‌కు యత్నించి క్యాచ్‌ ఔటయ్యాడు. కోహ్లి ఔటైన అనంతరం కరీబియన్‌ క్రికెటర్స్‌ సెలబ్రేషన్స్‌ చేసుకోలేదు. కోహ్లి ఔటైన అనంతరం సెలబ్రేషన్స్‌ చేసుకోవద్దని విలియమ్స్‌ సహచర ఆటగాళ్లకు విజ‍్క్షప్తి చేశాడు.  

వాల్ష్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి శివమ్‌ దూబే(54) క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. అనూహ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్‌ దూబే ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ యువీని తలపించాడు. ఇక ఇదే జోరులో హాఫ్‌ సెంచరీ సాధించి జోరు మీదున్న ఈ ఆల్‌రౌండర్‌.. ఆదే ఊపులో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. సారథి విరాట్‌ కోహ్లి(6 నాటౌట్‌)తో పాటు పంత్‌(6 నాటౌట్‌) క్రీజులో ఉన్నాడు.   

అంతకుముందు జేసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ (15) బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 56 పరుగులకే టీమిండియా ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. అంతకుముందు పియర్‌ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌(11) భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ఔట్‌గా వెనుదిరిగాడు. రాహుల్‌ నిష్క్రమణ అనంతరం కోహ్లికి బదులు అనూహ్యంగా శివమ్‌ దూబే క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం టీమిండియా 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. శివమ్‌ దూబే(46 నాటౌట్‌; 24 బంతుల్లో 2 ఫోర్లు,4 సిక్సర్లు)తో పాటు కోహ్లి(1 నాటౌట్‌) క్రీజులో ఉన్నాడు. 

టాస్‌ గెలిచిన విండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలు వచ్చారు. అయితే టీమిండియాకు అనుకుంత మంచి ఆరంభం లభించలేదు. పియర్‌ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌(11) భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ఔట్‌గా వెనుదిరుగుతాడు. అయితే రాహుల్‌ నిష్క్రమణతో మూడో స్థానంలో సారథి విరాట్‌ కోహ్లికి బదులు ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే వచ్చాడు. ఇప్పటివరకు శివమ్‌ దూబే ప్రతిభపై ఇంకా స్పష్టత రాకపోవడంతో.. ప్రయోగాత్మకంగా అతడి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జూనియర్‌ యువరాజ్‌ అంటూ శివమ్‌ దూబేను​ ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో శివమ్‌ రాణిస్తే హార్దిక్‌ పాండ్యాకు తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు