ఆ ఇద్దరిని పక్కకు పెట్టిన కోహ్లి

11 Dec, 2019 18:45 IST|Sakshi

ముంబై : సిరీస్‌ విజేతను డిసైడ్‌ చేసే మూడో టీ20 కోసం టీమిండియా, వెస్టిండీస్‌ జట్టు సిద్దమయ్యాయి. ముంబై వాంఖెడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌పై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన కోహ్లి సేన రెండో టీ20లో చతికిలపడింది. అయితే ఎలాగైన చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఇక రెండో మ్యాచ్‌లో గెలుపుతో ఆత్మవిశ్వాసంతో ఉన్న పొలార్డ్‌ అండ్‌ గ్యాంగ్‌ ముంబై మ్యాచ్‌ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. వాంఖెడే పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో పాటు ఛేజింగ్‌కు సులువు అవుతుందనే ఉద్దేశంతో పొలార్డ్‌ టాస్‌ గెలిచిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. 

ఇక ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా రెండు కీలక మార్పులు చేసింది. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, మణికట్టు స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌లను అనూహ్యంగా పక్కకు పెట్టి మహ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌లను తుది జట్టులోకి తీసుకుంది. అయితే అందరూ ఊహించనట్టు వాషింగ్టన్‌ సుందర్‌ను పక్కకు పెట్టలేదు. అతడికి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మరోసారి అవకాశం కల్పించింది. మరోవైపు విండీస్‌ జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. గత మ్యాచ్‌ విన్నింగ్‌ టీమ్‌తోనే ముంబై మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతోంది. ఇక ఈ మైదానంలో రెండో సారి బ్యాటింగ్‌ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువని గత రికార్డులు పేర్కొంటున్నాయి. చివరి ఆరు టీ20 మ్యాచ్‌లను పరిశీలిస్తే ఐదు మ్యాచ్‌ల్లో ఛేజింగ్‌ చేసిన జట్టే విజయం సాధించింది. దీంతో మ్యాచ్‌పై మరింత ఆసక్తి పెరిగింది.  

తుది జట్లు: 
భారత్‌: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శివమ్‌ దూబే, రిషభ్‌ పంత్‌, మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌
వెస్టిండీస్‌: కీరన్‌ పొలార్డ్‌ (కెప్టెన్‌), లెండిల్‌ సిమన్స్, లూయిస్, కింగ్, హెట్‌మైర్, నికోలస్‌ పూరన్, జేసన్‌ హోల్డర్, పియరీ, విలియమ్స్, కాట్రెల్, హేడెన్‌ వాల్ష్
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అఫీషియల్‌: శాంసన్‌కు నో ఛాన్స్‌

అయినా ట్వీట్‌ చేస్తే.. ఆయనకు సిగ్గు లేనట్టే..!!

యంగెస్ట్‌ క్రికెట్‌ కోచ్‌.. పేదరికంతో ఎదగలేక

దావన్‌ స్థానంలో మయాంక్‌!

కోహ్లి ట్వీట్‌ రికార్డు

జ్వాల కొత్త క్రీడా అకాడమీ

సింధు సత్తాకు పరీక్ష

భారత్‌ ‘టాప్‌’ లేపింది

పట్టాలి... క్యాచుల్ని, సిరీస్‌ని!

శాంసన్‌కు నో ఛాన్స్‌.. శశిథరూర్‌ ట్వీట్‌

అ​య్యర్‌కు పీటర్సన్‌ చిన్న సలహా!

‘మేం ఎక్కడికీ రాం.. మీరే ఇక్కడికి రావాలి’

మేం ఎవరికీ భయపడం: రోహిత్‌

‘గోల్డెన్‌ ట్వీట్‌ ఆఫ్‌ 2019’ ఇదే..

‘నా ప్రయాణం ముగిసింది’.. దరిద్రం పోయింది

గాయం తగ్గలేదు.. అతను ఆడటం డౌటే..!

సిగ్గుందా: పాక్‌ క్రికెటర్‌పై నెటిజన్ల ఫైర్‌!

అప్పటి నుంచి టాప్‌–5లోనే...

‘స్వర్ణ’ సాత్విక

ఆంధ్ర 211 ఆలౌట్‌

ఒలింపిక్స్ నుంచి రష్యాను గెంటేశారు

ఇండియన్‌ ఆర్మీపై ఎంఎస్‌ ధోని టీవి షో..!

రష్యాకు బిగ్ షాక్‌: ఒలింపిక్స్‌ నుంచి ఔట్‌!

వీరిద్దరి ప్రేమాయాణం నిజమేనా?

ఇలాగైతే ఎన్ని పరుగులు చేసినా వేస్ట్‌!

మైదానంలో పాము.. నిలిచిపోయిన మ్యాచ్‌

శ్వేతను పెళ్లాడిన సాయిప్రణీత్‌

విరాట్‌ కోహ్లి.. స్టన్నింగ్‌ క్యాచ్‌!

సరైన వయసు చెప్పండ్రా బాబు..! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘స్టైల్‌గా ఉంది కదా.. నాక్కూడా నచ్చింది’

విశాఖ నగరంలో తారక్‌

‘ప్రేమ అనేది అనుభూతి కంటే ఎక్కువ’

రణ్‌వీర్‌ సింగ్‌కు జోడీగా ‘అర్జున్‌రెడ్డి’ భామ

ఫిలించాంబర్‌ ఎదుట హీరో ఆత్మహత్యాయత్నం

కాజల్‌కు వరుడు దొరికాడు