ఆ విషయం మాకు తెలుసు: పొలార్డ్‌

16 Dec, 2019 11:00 IST|Sakshi

చెన్నై: టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా బౌలింగ్‌ను చీల్చి చెండాడి తమ జట్టు ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ హెట్‌మెయిర్‌ను కెప్టెన్‌ కీరోన్‌ పొలార్డ్‌ ప్రశంసల్లో ముంచెత్తాడు. అతనొక విధ్వంసకర ఆటగాడని, తనదైన రోజున బ్యాట్‌తో చెలరేగిపోయి మ్యాచ్‌ను ప్రత్యర్థి చేతుల్లోంచి అమాంతం లాగేసుకుంటాడంటూ పొలార్డ్‌ కొనియాడాడు. ‘ హెట్‌మెయిర్‌ విశేషమైన టాలెంట్‌ ఉన్న ఆటగాడనే విషయం మాకు తెలుసు. కానీ గత 9 నెలల నుంచి బ్యాటింగ్‌లో ఇబ్బంది పడుతూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.

మా జట్టులో అతనికి ఉన్న పాత్ర ఏమిటో తెలుసు కాబట్టే నమ్మకం ఉంచాం. గత 18 నెలల కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో తీపి జ్ఞాపకాలతో పాటు గడ్డు పరిస్థితుల్ని కూడా హెట్‌మెయిర్‌ చూశాడు. చాలా కాలం తర్వాత హెట్‌మెయిర్‌ నుంచి ఒక అద్భుత ఇన్నింగ్స్‌ రావడంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చాలా హ్యాపీగా ఉంది. ఈ మ్యాచ్‌లో ప్రతీ ఒక్కరూ రాణించడంతోనే సునాయాసంగా విజయం సాధించాం. మా ప్రధాన బౌలింగ్‌ ఆయుధం కాట్రెల్‌ ఎంతో పరిణితి చెందాడు. మా కరీబియన్‌ జట్టులో చాలా టాలెంట్‌ ఉంది. ఆ క్రమంలోనే యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది’ అని పొలార్డ్‌ పేర్కొన్నాడు.

భారత్‌తో జరిగిన తొలి వన్డేలో విండీస్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని విండీస్‌ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. హెట్‌మెయిర్‌(139; 106 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు), షాయ్‌ హోప్‌(102 నాటౌట్‌; 151 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌)లు సెంచరీలు సాధించి వెస్టిండీస్‌ విజయంలో  కీలక పాత్ర పోషించారు.

ఇక్కడ చదవండి:

జడేజా రనౌట్‌పై వివాదం.. కోహ్లినే వచ్చేశాడు!

హెట్‌మెయిర్‌ సరికొత్త రికార్డు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు