పాక్‌ను చిత్తుచేసిన టీమిండియా..

16 Oct, 2017 08:43 IST|Sakshi

జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత్‌

3-1తో పాక్‌పై ఘనవిజయం

ఢాకా: ఆసియాకప్‌ హాకీ టోర్నీలో నేడు(ఆదివారం) జరిగిన అసలు సిసలు పోరులో చిరకాల పత్యర్థి పాకిస్థాన్ పై భారత్‌ ఘనవిజయం సాధించింది. చివరిలీగ్‌ మ్యాచ్‌లో 3-1తో గెలిచి సగర్వంగా సూపర్‌-4 దశకు చేరింది. కొత్త కోచ్‌ జోయెర్డ్‌ మరీన్‌ సారథ్యంలో భారత పురుషుల హాకీ జట్టు జపాన్‌, బంగ్లాదేశ్‌, పాక్‌లపై వరుసగా గెలుపొంది టోర్నిలో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ తాజా విజయంతో ఇంగ్లండ్‌లో జరిగిన హాకీ వరల్డ్‌ లీగ్‌లో పాక్‌పై 6-1 ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

ఇక యుద్దవాతావరణం తలపించిన ఈమ్యాచ్‌లో భారత ఆటగాళ్లు తొలి అర్ధభాగం నుంచే ఆధిపత్యం కనబర్చారు. చింగేల్‌స్న్సన్‌ సింగ్‌ 17 వనిమిషంలో సాధించిన గోల్‌తో భారత్‌కు 1-0 ఆధిక్యం లభించింది. 44వ నిమిషంలో రమణ్‌ దీప్‌ సింగ్‌ రెండో గోల్‌ సాధించాడు. ఇక 45 నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ ప్రీత్‌సింగ్‌ గోల్‌గా మలిచాడు. దీంతో భారత్‌ 3-0 ఆధిక్యం సాధించింది. ఇక  49 నిమిషంలో పాక్‌ ఆటగాడు అలీషాన్‌ గోల్‌ చేసిన లాభం లేకపోయింది. 3-1తో భారత్‌ విజయం సులువైంది. పాక్‌ సీనియర్‌ ఆటగాళ్లైన రిజ్వాన్‌, మహమ్ముద్‌ క్రీడాస్పూర్తీ మరిచి ప్రవర్తించడంతో రిఫరీ ఎల్లో కార్డు చూపించడంతో పాక్‌ కొద్దీసేపు 9 మంది ప్లేయర్లతోనే బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని వార్తలు