వాన ముంచెత్తింది

16 Sep, 2019 01:52 IST|Sakshi

ధర్మశాలలో భారీ వర్షం

భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20 రద్దు

రెండో మ్యాచ్‌ బుధవారం మొహాలీలో

ధర్మశాల: భారత్‌–దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్‌ ఎప్పుడు, ఎక్కడ జరిగినా... వరుణుడి చుట్టపు చూపు పలకరింపు తప్పదేమో! ఔను మరి... రికార్డులు ఇదే విషయం చెబుతున్నాయి. గత మూడు సిరీస్‌ (2011–12, 2015–16, 2017–18)లలో ఏదో ఒక మ్యాచ్‌నైనా అడ్డుకున్న వర్షం వరుసగా నాలుగో సిరీస్‌లోనూ నేనున్నానంటూ వచ్చేసింది. దీంతో ఆదివారం ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య జరగాల్సిన తొలి టి 20 రద్దయింది. మధ్యాహ్నం నుంచే వాతావరణం మేఘావృతమై ఉండగా... సాయంత్రానికి వాన మొదలైంది. అంపైర్లు పిచ్‌ను తనిఖీ చేయాల్సిన పని లేకుండా, ఔట్‌ ఫీల్డ్‌ను పదేపదే పరిశీలించాల్సిన అవసరం రానంతగా తెరపి లేకుండా కురిసింది.

దీంతో కనీసం టాస్‌ కూడా పడలేదు. తుది జట్ల ప్రకటన సైతం చేయలేదు. మైదానంలో మంచి డ్రైనేజీ వ్యవస్థ ఉన్నా, ఆటకు ఏమాత్రం వీలుకానంతగా వర్షం పటడంతో చివరకు మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. మ్యాచ్‌ ప్రారంభ సమయం (రాత్రి గం.7) నుంచి 50 నిమిషాలు వేచి చూసిన అనంతరం ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితి తెలిసిపోయిన ప్రేక్షకులు అంతకు అరగంట ముందు నుంచే స్టేడియం నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టి20 ఈ నెల 18న బుధవారం మొహాలీలో జరుగనుంది.  

కుర్రాళ్లకు నాలుగైదు అవకాశాలే: కోహ్లి
 వచ్చే ఏడాది టి20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని... లభించిన నాలుగైదు అవకాశాల్లోనే తమను తాము నిరూపించుకోవాలని జట్టులోని కుర్రాళ్లకు టీమిండియా కెపె్టన్‌ విరాట్‌ కోహ్లి సూచించాడు. కెరీర్‌ ఆరంభంలో తనకూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని అతడు చెప్పుకొచ్చాడు. ‘ప్రపంచ కప్‌ ముందు మాకు గరిష్టంగా 30 మ్యాచ్‌లున్నాయి. ప్రస్తుతం తీవ్ర పోటీ వాతావరణంలో ఉన్నాం. అందుకని కాసిన్ని అవకాశాలనే ఒడిసిపట్టాలి. వాస్తవానికి వీటిని తక్కువనే భావించాలి.

అరంగేట్రం సమయంలో నేను కూడా పదిహేను చాన్సులు వస్తాయని భావించలేదు. ఇప్పుడు జట్టులోనూ ఇదే మనస్తత్వం ఉంది. దీనిని తెలుసుకుని రాణించినవారే నిలవగలుగుతారు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. ఓవైపు టి20 ప్రపంచ కప్‌నకు సన్నద్ధమవుతూనే టెస్టు చాంపియన్‌íÙప్‌ పైనా దృష్టిపెట్టినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో జట్టును పటిష్ట పరిచే దిశగా, విజయాలు సాధించే విధంగా యువకులను సమయానుకూలంగా పరీక్షిస్తామని చెప్పుకొచ్చాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బంగ్లాదేశ్‌కు అఫ్గానిస్తాన్‌ షాక్‌

భారత రెజ్లర్లకు మళ్లీ నిరాశ

వియత్నాం ఓపెన్‌ విజేత సౌరభ్‌ వర్మ

ప్రిక్వార్టర్స్‌లో కవీందర్, సంజీత్‌

ఆధిబన్, నిహాల్‌ నిష్క్రమణ

ఢిల్లీని గెలిపించిన నవీన్‌

క్వార్టర్స్‌లో భారత్‌

బిలియర్డ్స్‌ రాజు మళ్లీ అతడే

యాషెస్‌ ఐదో టెస్టు ఇంగ్లండ్‌దే

పంత్‌కు గంభీర్‌ ‘సీరియస్‌’ వార్నింగ్‌!

సౌరభ్‌ వర్మదే టైటిల్‌

టీమిండియా కొత్త కొత్తగా..

తండ్రిని మించిపోయేలా ఉన్నాడు!

అది మాకు పీడకలలా మారింది: ఆసీస్‌ కెప్టెన్‌

లక్ష్యసేన్‌ సంచలన విజయం

ఆసీస్‌-ఇంగ్లండ్‌ క్రికెటర్ల వాగ్వాదం

బ్యాట్‌తో పరుగులే కాదు.. ఎగిరి పట్టేస్తా!

హైజంప్‌లో ప్రణయ్‌కు స్వర్ణం

ఫైనల్లో సుమిత్‌ నాగల్‌

పట్టు బిగించిన ఇంగ్లండ్‌

మూడో రౌండ్‌లో హరికృష్ణ

‘7 బంతుల్లో 7 సిక్సర్లు’

పుణేరి పల్టన్‌ విజయం

‘దీపావళికి క్రికెట్‌ మ్యాచ్‌లు వద్దు’

‘ఆ ట్వీట్‌ పాఠం నేర్పింది’

106 పరుగులే చేసినా...

నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

కపిల్‌దేవ్‌కు అరుదైన గౌరవం

పీవీ సింధుకు కారును బహూకరించిన నాగ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మార్షల్‌ నచ్చితే నలుగురికి చెప్పండి

లేడీ సూపర్‌స్టార్‌

గద్దలకొండ గణేశ్‌... రచ్చ రచ్చే

భయపెడుతూ నవ్వించే దెయ్యం

నవ్వులే నవ్వులు

శ్రీముఖి.. అవకాశవాది : శిల్పా