ఆరంభంలోనే ఆసీస్‌కు షాక్‌

12 Jan, 2019 07:49 IST|Sakshi

సిడ్నీ: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 8 పరుగుల వద్ద మొదటి వికెట్‌ కోల్పోయింది. భారత బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ప్రారంభంలోనే ఆసీస్‌ను దెబ్బ తీశాడు. డాషింగ్‌ ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌(6)ను అవుట్‌ చేశాడు. కంగారూ టీమ్‌ కుదురుకుంటున్న దశలో టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ మరో దెబ్బ తీశాడు. జట్టు స్కోరు 41 పరుగుల వద్ద మరో ఓపెనర్‌ అలెక్స్‌ క్యారీ(24)ని పెవిలియన్‌కు పంపాడు.

టాస్‌ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ ముందుగా బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించాడు. టాస్‌ గెలిస్తే తాము ముందుగా బ్యాటింగ్‌ చేయాలనుకున్నామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెప్పాడు. స్పిన్‌ బౌలింగ్‌కు పిచ్‌ అనుకూలిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆసీస్‌ను తమ బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేయగలరని, మిడిల్‌ ఓవర్లు చాలా కీలకమని  పేర్కొన్నాడు. రవీంద్ర జడేజా, ఖలీల్‌ అహ్మద్‌లకు తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. కేదార్‌ జాదవ్‌కు చోటు దక్కలేదు. (ఈ సిరీసూ గెలిస్తే సరి)

తుది జట్లు
భారత్‌: శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), అంబటి రాయుడు, దినేశ్‌ కార్తిక్‌, ఎంఎస్‌ ధోని (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌

ఆస్ట్రేలియా: ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), అలెక్స్‌ క్యారీ(వికెట్‌ కీపర్‌), షాన్‌ మార్ష్‌, ఉస్మాన్‌ ఖావాజా, పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌‌, మార్కస్‌ స్టొయినిస్‌, మ్యాక్స్‌వెల్‌, రిచర్డ్‌సన్‌, లయన్‌, పీటర్‌ సిడిల్‌, జాసన్‌ బెహ్రిన్‌డార్ఫ్‌

మరిన్ని వార్తలు