‘ఆరే’స్తే ఆసీస్‌కు అగ్రస్థానం

12 Oct, 2013 01:40 IST|Sakshi
‘ఆరే’స్తే ఆసీస్‌కు అగ్రస్థానం

దుబాయ్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య టాప్ ర్యాంకు సమరానికి ఈ వన్డే సిరీస్ వేదికైంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఇరు జట్లు వరుసగా తొలి రెండు ర్యాంకుల్లో ఉన్నాయి. అయితే భారత్ నంబర్‌వన్ ర్యాంకు మాత్రం దాదాపు పదిలమనే చెప్పొచ్చు. ఈ జట్ల మధ్య రేటింగ్ పాయింట్లలో చాలా తేడా ఉండటమే దీనికి కారణం.

 

భారత్ ఖాతాలో 123 పాయింట్లుండగా, ఆసీస్ 115 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఏడు వన్డేల సిరీస్‌లో కంగారూ జట్టు 6-1 లేదంటే అంతకుమించిన తేడాతో గెలిస్తేనే టాప్ ర్యాంకుకు ఎగబాకుతుంది. అప్పుడు ఆసీస్ 121 పాయింట్లకు చేరి, భారత్ 118 పాయింట్లకు దిగజారే అవకాశముంటుంది. అయితే భారత్ కనీసం రెండు వన్డేలు గెలిచినా టాప్ ర్యాంకుకు మాత్రం ఢోకా ఉండదు. ఇరు జట్ల మధ్య పుణేలో 13న తొలి వన్డే జరగనుంది. బౌలర్ల ర్యాంకుల్లో రవీంద్ర జడేజా, నరైన్ (విండీస్)తో కలిసి అగ్రస్థానంలో ఉన్నాడు.
 

మరిన్ని వార్తలు