భారత రెజ్లర్ల తీన్‌మార్‌...

20 Feb, 2020 06:37 IST|Sakshi
హర్‌దీప్‌, ఆదిత్య

ఒకే రోజు మూడు కాంస్య పతకాలు

న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత రెజ్లర్లు ఆకట్టుకున్నారు. ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు బుధవారం గ్రీకో రోమన్‌ శైలిలో అశు (67 కేజీలు), ఆదిత్య కుందు (72 కేజీలు), హర్‌దీప్‌ (97 కేజీలు) భారత్‌కు మూడు కాంస్య పతకాలను అందించారు. జ్ఞానేందర్‌ (60 కేజీలు) కాంస్య పతక పోరులో ఓడిపోయాడు. కాంస్యం కోసం జరిగిన బౌట్‌లలో అశు 8–1తో అబ్దుల్‌ కరీమ్‌ మొహమ్మద్‌ అల్‌ హసన్‌ (సిరియా)ను ఓడించగా... ఆదిత్య 8–0తో నవో కుసాకా (జపాన్‌)పై, హర్‌దీప్‌ 3–1తో బెక్‌సుల్తాన్‌ (కిర్గిస్తాన్‌)పై విజయం సాధించారు. జ్ఞానేందర్‌ 0–6తో బఖ్‌రమోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓటమి చవిచూశాడు. ఓవరాల్‌గా భారత్‌కు గ్రీకో రోమన్‌ విభాగంలో ఐదు పతకాలు లభించాయి. నేడు, రేపు మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో పోటీలు జరుగుతాయి. ఆ తర్వాత శని, ఆదివారాల్లో పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో పోటీలుంటాయి.   

మరిన్ని వార్తలు