భారత్‌కు నాలుగు పతకాలు

22 May, 2014 01:02 IST|Sakshi

యూత్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్
 బ్యాంకాక్: యూత్ ఒలింపిక్స్‌కు అర్హత కోసం జరుగుతున్న ఆసియా స్థాయి క్వాలిఫికేషన్ పోటీల్లో భారత్.. తొలిరోజే ఓ స్వర్ణంతో సహా నాలుగు పతకాలతో మెరిసింది. బాలుర 1500 మీటర్ల రేసులో అజయ్‌కుమార్ సరోజ్ 3 నిమిషాల 56.47 సెకన్లతో స్వర్ణం సాధించాడు. దీంతో ఆగస్టు 16 నుంచి 28 వరకు చైనాలోని నన్‌జింగ్‌లో జరగనున్న యూత్ ఒలింపిక్స్‌కు అజయ్ అర్హత సాధించాడు.
 
 ఇక బాలుర 110 మీటర్ల హర్డిల్స్‌లో మేమన్ పౌలోజ్ 13.80 సెకన్లతో, బాలుర జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా 70.54 మీటర్ల దూరంతో రజత పతకాలను సొంతం చేసుకున్నారు. భారత్‌కు దక్కిన మరో పతకాన్ని (కాంస్యం) బాలికల జావెలిన్ త్రోలో పుష్పా జఖార్ సాధించింది. 48.73 మీటర్ల దూరంతో  పుష్ప మూడో స్థానంలో నిలిచింది. ఇక బాలికల హై జంప్ లిబియా షాజీ ఐదో స్థానం, బాలుర డిస్కస్ త్రోలో ఎస్.మిత్రవరుణ్ నాలుగో స్థానం పొందారు.

మరిన్ని వార్తలు