భారత్ - బంగ్లా టెస్టు డ్రా

14 Jun, 2015 16:44 IST|Sakshi
భారత్ - బంగ్లా టెస్టు డ్రా

ఫతుల్లా: భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. వరణుడి ప్రభావమే ఇండియాను విజయానికి దూరం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 462 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 253 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వెంటనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లా.. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. దీంతో టెస్టు డ్రాగా ముగిసింది.

భారత ఓపెనర్ శిఖర్ ధావన్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్లు ధావన్ (173), విజయ్ (150), సెంచరీలతో ఆకట్టుకోగా.. రహానె (98) త్రుటిలో సెంచరీ మిస్సయ్యాడు. చక్కటి ప్రతిభను కనబరిచారని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించారు. తొలి ఇన్నింగ్స్లో రవించంద్రన్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా.. హర్భజన్ సింగ్ 3 వికెట్లు తీశాడు. బంగ్లా బౌలర్లలో షకీబ్ ఉల్ హసన్ నాలుగు, జుబేర్ హసన్ రెండు వికెట్లు పడగొట్టారు.

>
మరిన్ని వార్తలు