ఫైనల్ కు చేరిన భారత్

17 Oct, 2015 19:30 IST|Sakshi
ఫైనల్ కు చేరిన భారత్

జోహార్ బాహ్రూ(మలేషియా): సుల్తాన్ ఆఫ్ జొహార్ కప్ జూనియర్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఫైనల్ కు చేరింది. శనివారం జరిగిన చివరి లీగ్ లో భారత్ 1-0 తేడాతో పటిష్టమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు గోల్స్ సాధించకపోయినా.. రెండో అర్ధభాగంలో భారత్ గోల్ ను నమోదు చేసింది. ఆట 42 వ నిమిషంలో భారత ఆటగాడు పెనాల్టీ స్ట్రోక్ ను గోల్ గా మలచి జట్టును ఆధిక్యంలోకి తీసుకువెళ్లాడు.

 

అనంతరం ఆస్ట్రేలియా ప్రతిఘటించినా భారత ఆటగాళ్లు అడ్డుకుని జట్టుకు మంచి విజయాన్ని సాధించిపెట్టారు. ఆదివారం నాటి తుదిపోరులో గ్రేట్ బ్రిటన్ తో భారత్ తలపడనుంది. వరుసగా రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్‌గా ఉన్న భారత్ ఈసారీ కూడా టైటిల్ ను తన ఖాతాలో వేసుకుని ఘనమైన ముగింపు ఇవ్వాలని భావిస్తోంది.

మరిన్ని వార్తలు