భారత్ బోణి

31 Mar, 2014 02:34 IST|Sakshi
భారత్ బోణి

మహిళల టి20 ప్రపంచకప్  
 బంగ్లాదేశ్‌పై గెలుపు
 
 సిల్హెట్: మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి విజయం నమోదు చేసింది. సిల్హెట్‌లో ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో మిథాలీ సేన 79 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ 8 వికెట్లకు 72 పరుగులే చేసింది.
 
 రాణించిన హర్మన్‌ప్రీత్, మిథాలీ
 తొలి రెండు మ్యాచ్‌ల్లో చెత్త ఆటతో సెమీస్ రేసు నుంచి వైదొలిగిన భారత జట్టు, బంగ్లాతో మ్యాచ్‌లో సమష్టిగా ఆడింది. ఓపెనర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ (59 బంతుల్లో 77; 12 ఫోర్లు, 1 సిక్సర్), మిథాలీ రాజ్ (38 బంతుల్లో 41; 5 ఫోర్లు) రాణించి భారత జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇద్దరు తొలి వికెట్‌కు 14.3 ఓవర్లలో 107 పరుగులు జోడించారు. ఆ తర్వాత జులన్ గోస్వామి (3/11), శుభ్‌లక్ష్మి శర్మ (3/12), పూనమ్ యాదవ్ (2/10) ప్రత్యర్థి బ్యాట్స్‌ఉమెన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు.
 

>
మరిన్ని వార్తలు