భారత్‌కు రెండో గెలుపు 

27 Mar, 2019 01:35 IST|Sakshi

అజ్లాన్‌ షా కప్‌ టోర్నీ

ఇపో (మలేసియా): దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్న భారత హాకీ జట్టు మళ్లీ విజయాల బాట పట్టింది. సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ టోర్నమెంట్‌లో రెండో విజయం నమోదు చేసింది. ఆతిథ్య మలేసియా జట్టుతో మంగళవారం జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 4–2 గోల్స్‌ తేడాతో గెలిచింది. భారత్‌ తరఫున సుమీత్‌ కుమార్‌ (17వ, 27వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... వరుణ్‌ కుమార్‌ (36వ నిమిషంలో), మన్‌దీప్‌ సింగ్‌ (58వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు.

మలేసియా జట్టుకు రాజీ రహీమ్‌ (27వ నిమిషంలో), ఫిర్హాన్‌ అశారి (57వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ చివరి 22 సెకన్లలో గోల్‌ సమర్పించుకొని ‘డ్రా’తో సరిపెట్టుకుంది. మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం భారత్‌ ఆరంభం నుంచే పక్కా ప్రణాళికతో ఆడింది. తొలి క్వార్టర్‌లో ఖాతా తెరువకున్నా... రెండో క్వార్టర్‌లో రెండు గోల్స్‌ సాధించింది. అనంతరం మూడో క్వార్టర్‌లో, నాలుగో క్వార్టర్‌లో ఒక్కో గోల్‌ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ గెలుపుతో భారత్‌ పాయింట్ల పట్టికలో ఏడు పాయింట్లతో దక్షిణ కొరియాతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. బుధవారం జరిగే త§ 

మరిన్ని వార్తలు