ముగ్గురు భారత ఆటగాళ్ల హ్యా'ట్రిక్' ఫీట్

25 Sep, 2016 20:06 IST|Sakshi
ముగ్గురు భారత ఆటగాళ్ల హ్యా'ట్రిక్' ఫీట్

ఒమన్ పై భారత్ ఘనవిజయం
భారత హాకీ యువజట్టు సంచలన ఆటతీరుతో ఆకట్టుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరిగిన అండర్-18 ఆసియా కప్ లో భాగంగా జరిగిన నాకౌట్ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు గోల్స్ వర్షం కురిపించారు. దీంతో ఒమన్ పై 11-0 గోల్స్ తేడాతో భారత్ విజయకేతనం ఎగురవేసింది. ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన దిల్ ప్రీత్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

రికార్డు స్థాయిలో ఈ మ్యాచ్ లో ముగ్గురు భారత ఆటగాళ్లు హ్యాట్రిక్ గోల్స్ సాధించడం విశేషం. కెప్టెన్ నీలమ్ సంజీప్ (8, 15, 52), కొంజెంగ్ బామ్ సింగ్(30, 40, 62), దిల్ప్రీత్ సింగ్ (34, 53, 68) నిమిషాలలో గోల్స్ చేయగా... అభిషేక్, శివం ఆనంద్ చెరో గోల్ చేయడంతో భారత్ ఏకంగా 11 గోల్స్ తమ ఖాతాలో వేసుకుంది. అయితే ప్రత్యర్థి ఒమన్ జట్టు కనీసం ఖాతా తెరవలేకపోయింది. 

మరిన్ని వార్తలు