ప్రియాంక్‌ 206...భరత్‌ 142

10 Feb, 2019 01:39 IST|Sakshi

వాయనాడ్‌: ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ భారీస్కోరు చేసింది. ఓపెనర్‌ ప్రియాంక్‌ పాంచల్‌ (313 బంతుల్లో 206; 26 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో, ఆంధ్ర రంజీ క్రికెటర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ (139 బంతుల్లో 142; 11 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కారు. దీంతో భారత్‌ ‘ఎ’ 134.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 540 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 219/1తో ఆటకొనసాగించిన భారత్‌ ఆదిలోనే ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ (89; 11 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయింది. క్రితం రోజు స్కోరుకు కేవలం పరుగు మాత్రమే జతచేసిన రాహుల్‌ రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన వారిలో కెప్టెన్‌ అంకిత్‌ బావ్నే (0) డకౌట్‌ కాగా, ఆంధ్ర బ్యాట్స్‌మన్‌ రికీ భుయ్‌ (16) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.

దీంతో 262 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌ ‘ఎ’ను పాంచల్, శ్రీకర్‌ భరత్‌ నిలబెట్టారు. ముందుగా కుదురుకునేందుకు ప్రాధాన్యమిచ్చినా... తర్వాత భరత్‌ వన్డేను తలపించే ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 196 పరుగులు జోడించారు. ద్విశతకం పూర్తయ్యాక జట్టు స్కోరు 458 పరుగుల వద్ద పాంచల్‌ నిష్క్రమించాడు. జలజ్‌ సక్సేనా (28)తో కలిసి జట్టు స్కోరును 500 పరుగులు దాటించాక శ్రీకర్‌ భరత్‌ ఔటయ్యాడు. కాసేపటికే కెప్టెన్‌ బావ్నే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. దీంతో భారత్‌ ‘ఎ’కు 200 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన ఇంగ్లండ్‌ లయన్స్‌ ఆట నిలిచే సమయానికి 5 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 20 పరుగులు చేసింది. ఓపెనర్లు హోల్డన్‌ (9 బ్యాటింగ్‌), డకెట్‌ (9 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.   

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రపంచ రికార్డుపై అక్కాచెల్లెళ్ల దృష్టి

సెమీస్‌లో ప్రసాద్‌ 

భారత మహిళలదే సిరీస్‌ 

చైనా చేతిలో భారత్‌ చిత్తు

కోహ్లి ఒక్కడే  కప్‌ గెలిపించలేడు! 

శతకోటి ఆశలతో... 

శ్రీలంకకు సవాల్‌! 

గెలుపు సంబరాలతో సెలవు ప్రకటించిన ఇందిర..!

ఆ జాబితాలో టీమిండియా నుంచి ఒక్కరూ లేరు..!

‘ప్రపంచకప్‌.. కోహ్లి ఒక్కనితో కాదు’

ద్యుతీ యూఆర్‌ ట్రూ చాంపియన్‌: తెలుగు డైరెక్టర్‌

నిఖత్‌ జరీన్‌కు పతకం ఖాయం 

తప్పుడు నిర్ణయం...  తగిన మూల్యం 

ఆర్చర్‌ వచ్చేశాడు 

గోమతి డోపీ... సస్పెన్షన్‌ 

అక్టోబర్‌ 22న బీసీసీఐ ఎన్నికలు 

సవాళ్ల  సమరం 

ధోనిపై పాక్‌ మాజీ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు

మా అక్కే బ్లాక్‌మెయిల్‌ చేసింది: ద్యుతీ చంద్‌

పాండ్యాతో నాకు పోటీ ఏంటి?

ఆ విషయంలో ధోనికి సాటేలేరు: రవిశాస్త్రి

ఇది అత్యంత చాలెంజింగ్‌ వరల్డ్‌కప్‌: కోహ్లి

వరల్డ్‌కప్‌ ఇంగ్లండ్‌ జట్టులో భారీ మార్పులు

‘అతనిలా బ్యాటింగ్‌ చేయడం ఇష్టం’

పాక్‌ క్రికెటర్‌ వినూత్న నిరసన

ఆ ఇద్దరికీ నేను పెద్ద అభిమానిని: స్టోక్స్‌

పాంటింగ్‌ చుట్టూ 8 ఏళ్ల పిల్లల్లా!

అనిరుధ్‌ జంటకు డబుల్స్‌ టైటిల్‌

పుల్లెల గాయత్రికి టాప్‌ సీడింగ్‌

ఫార్ములా వన్‌ దిగ్గజం కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

అంజలి చాలా నేర్పించింది!

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

‘విజయగర్వం నా తలకెక్కింది’