మనదే పైచేయి

24 Aug, 2019 04:48 IST|Sakshi

తొలి టెస్టులో విండీస్‌పై భారత్‌కు పట్టు

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 297 ఆలౌట్‌

అర్ధశతకంతో రాణించిన జడేజా

సెంచరీ అందుకోలేకపోయిన రహానే

నార్త్‌సౌండ్‌ (అంటిగ్వా): వెస్టిండీస్‌పై తొలి టెస్టులో టీమిండియా క్రమంగా పట్టు బిగిస్తోంది. ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (112 బంతుల్లో 58; 6 ఫోర్లు, సిక్స్‌) అర్ధ సెంచరీ సాయంతో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 96.4 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటై గౌరవప్రద స్కోరు చేసిన భారత్‌... అనంతరం ప్రత్యర్థి టాపార్డర్‌ను పడగొట్టింది. టీ విరామ సమయానికి ఓపెనర్లు క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (14); క్యాంప్‌బెల్‌ (23)తో పాటు అరంగేట్ర బ్యాట్స్‌మన్‌ షమారా బ్రూక్స్‌ (11) వికెట్లు కోల్పోయిన విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 82 పరుగులు చేసింది.

చేతిలో ఏడు వికెట్లుండగా ఆ జట్టు మరో 215 పరుగులు వెనుకబడి ఉంది. షమీ, ఇషాంత్, జడేజా తలా ఒక వికెట్‌ పడగొట్టారు. టీమిండియా ఇన్నింగ్స్‌లో రహానే (81; 10 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. గురువారం ఆంధ్ర క్రికెటర్‌  విహారి (32; 5 ఫోర్లు)తో కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిలిపిన అతడు సెంచరీని మాత్రం అందుకోలేకపోయాడు. ఐదో వికెట్‌కు వీరు 82 పరుగులు జత చేశారు. వర్షం కారణంగా తొలి రోజు ఆటను 68.5 ఓవర్ల వద్దే ముగించారు. ఓవర్‌నైట్‌ స్కోరు 203/6తో శుక్రవారం ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌... పంత్‌ (24) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. 207/7తో ఉన్న ఈ దశలో జట్టు 250 దాటడమే గగనం అనిపించింది. కానీ, జడేజా, ఇషాంత్‌ (62 బంతుల్లో 19)  8వ వికెట్‌కు 60 పరుగులు జోడించారు.  

స్కోరు వివరాలు:
భారత తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) హోప్‌ (బి) చేజ్‌ 44; మయాంక్‌ (సి) హోప్‌ (బి) రోచ్‌ 5; పుజారా (సి) హోప్‌ (బి) రోచ్‌ 2; కోహ్లి (సి) బ్రూక్స్‌ (బి) గాబ్రియెల్‌ 9; రహానే (బి) గాబ్రియెల్‌ 81; విహారి (సి) హోప్‌ (బి) రోచ్‌ 32; పంత్‌ (సి) హోల్డర్‌ (బి) రోచ్‌ 24; జడేజా (సి) హోప్‌ (బి) హోల్డర్‌ 58; ఇషాంత్‌ (బి) గాబ్రియెల్‌ 19; షమీ (సి అండ్‌ బి) చేజ్‌ 0; బుమ్రా (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (96.4 ఓవర్లలో ఆలౌట్‌) 297.

వికెట్ల పతనం: 1–5, 2–7, 3–25, 4–93, 5–175, 6–189, 7–207, 8–267, 9–268, 10–297.

బౌలింగ్‌: రోచ్‌ 25–6–66–4; గాబ్రియెల్‌ 22–5–71–3; హోల్డర్‌ 20.4–11–36–1; కమిన్స్‌ 13–1–49–0; చేజ్‌ 16–3–58–2.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా