వారితో నో ప్రాబ్లమ్: రవిశాస్త్రి

21 Jul, 2017 13:01 IST|Sakshi
వారితో నో ప్రాబ్లమ్: రవిశాస్త్రి

కొలంబో: భారత క్రికెట్ లో ద వాల్ గా పేరుగాంచిన రాహుల్ ద్రవిడ్ తో కలిసి పనిచేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. భారత జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్గా ద్రవిడ్ ఉంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నాడు. ఒకవేళ ద్రవిడ్ సమయం కేటాయిస్తేనంటే అతని సహకారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు శాస్త్రి తెలిపాడు. అదే సమయంలో బౌలింగ్ కన్సల్టెంట్ గా జహీర్ ఖాన్ తో కూడా కలిసి పనిచేయడానికి ఎటువంటి ఇబ్బందీలేదన్నాడు.

' జహీర్, ద్రవిడ్ లకు విశేషమైన అనుభవం ఉంది. వారిద్దరూ కన్సల్టెంట్లుగా జట్టుతో జాయిన అయినా నాకు అభ్యంతరం లేదు. వారు ఉండటం జట్టుకు అదనపు బలం. వారిని అగౌరపరచాలనే ఉద్దేశం నాకు లేదు. వరల్డ్ కప్ కు రెండేళ్లు సమయం ఉన్నందున కన్సెల్టెంట్ లను ఆహ్వానించడానికి తగిన ప్రణాళిక అవసరం'అని రవిశాస్త్రి తెలిపాడు.

 

మరిన్ని వార్తలు