బంగ్లాదేశ్ పై రైనా సేన గెలుపు

15 Jun, 2014 21:44 IST|Sakshi

మీర్పూర్: బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రైనా సేన మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 26 ఓవర్లకు కుదించారు. భారత్ కు 26 ఓవర్లలో 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. మరో 7 బంతులు మిగులుండగానే రైనా సేన విజయాన్ని అందుకుంది. 24.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.

ఓపెనర్లు రాబిన్ ఊతప్ప(50), అజింక్య రహానే(64) అర్థ సెంచరీలతో రాణించారు. పూజారా డకౌట్ అయ్యాడు. రాయుడు 16, రైనా 15 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ 2 వికెట్లు పడగొట్టాడు. మోర్తజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. రహానే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు.

>
మరిన్ని వార్తలు