ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకులు వచ్చేశాయి...

4 May, 2016 18:05 IST|Sakshi
ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకులు వచ్చేశాయి...

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వన్డే, టీ20 ర్యాంకింగ్స్లో భారత క్రికెట్ జట్టు ఒక్కో స్థానం కిందకి దిగింది. ఐసీసీ విడుదల చేసిన వార్షిక సవరణ జాబితాలో భారత్ కు టీ20ల్లో రెండో స్థానం దక్కగా, వన్డేల్లో నాలుగో స్థానంలో నిలిచింది. నిన్న ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

టీ20 ర్యాంకింగ్స్:

న్యూజీలాండ్ 132 పాయింట్లతో తొలి ర్యాంకును సాధించగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్(3), దక్షిణాఫ్రికా(4), ఇంగ్లండ్ (5), ఆస్ట్రేలియా(6) ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. బంగ్లాదేశ్ ను వెనక్కినెట్టి అఘ్గనిస్తాన్ కాస్త మెరుగుపడింది. బంగ్లాదేశ్(10)

వన్డే ర్యాంకింగ్స్:
వన్డే ప్రపంచకప్ ఐదోసారి సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా తాజా ర్యాంకింగ్స్ లో తొలిస్థానాన్ని దక్కించుకోగా, న్యూజీలాండ్(2), దక్షిణాఫ్రికా(3), భారత్(4), శ్రీలంక(5) స్థానాల్లో నిలిచాయి. ఆసీస్ ఖాతాలో 124 పాయింట్లు ఉండగా, న్యూజీలాండ్ 113 పాయింట్లు, దక్షిణాఫ్రికా 112 పాయింట్లు, భారత్ 109 పాయింట్లతో ఉన్నాయి.

టెస్ట్ ర్యాంకింగ్స్:
టెస్టుల్లో అయితే ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని దక్కించుకోగా, పాకిస్తాన్(3), ఇంగ్లండ్(4), న్యూజీలాండ్(5) స్థానాల్లో నిలిచాయి. కాగా, గత ర్యాంకుల్లో మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఆరో స్థానానికి పడిపోయింది. 2014-15 వార్షిక సంవత్సరంలో సాధించిన ఫలితాల ఆధారంగా టెస్టు ర్యాంకింగ్స్ ను ప్రకటించారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు