భారత్‌ ‘ఎ’, ఇంగ్లండ్‌ లయన్స్‌ మ్యాచ్‌ ‘డ్రా’

11 Feb, 2019 03:19 IST|Sakshi

వాయనాడ్‌: ఒలివర్‌ పోప్‌ (122 బంతుల్లో 63; 10 ఫోర్లు), సామ్యూల్‌ హైన్‌ (178 బంతుల్లో 57; 7 ఫోర్లు) పట్టుదలగా ఆడటంతో... భారత్‌ ‘ఎ’తో జరిగిన నాలుగు రోజుల తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ లయన్స్‌ ‘డ్రా’గా ముగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 20/0తో ఆట చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ లయన్స్‌ 82 ఓవర్లలో ఐదు వికెట్లకు 214 పరుగులు చేసింది.

మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 13 ఓవర్లు మిగిలి ఉండగానే ఇద్దరు కెప్టెన్ల అంగీకారంతో ఆటను నిలిపి వేశారు. పోప్, హైన్‌ మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. రెండు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు ఈనెల 13న మైసూర్‌లో ప్రారంభమవుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ చేసిన భారత ‘ఎ’ బ్యాట్స్‌మన్‌ ప్రియాంక్‌ పాంచల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం లభించింది. 

సంక్షిప్త స్కోర్లు 
ఇంగ్లండ్‌ లయన్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 340; భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌: 540/6 డిక్లేర్డ్‌; ఇంగ్లండ్‌ లయన్స్‌ రెండో ఇన్నింగ్స్‌: 214/5 (83 ఓవర్లలో) (ఒలివర్‌ పోప్‌ 63, సామ్యూల్‌ హైన్‌ 57, డకెట్‌ 30, హోల్డెన్‌ 29; జలజ్‌ సక్సేనా 2/41). 

మరిన్ని వార్తలు