టీమిండియాకు ఊహించని చెత్త రికార్డు!

1 Jul, 2019 16:13 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌:  ప్రస్తుత వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియాకు ఇంగ్లండ్‌ బ్రేక్‌ వేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లండ్‌ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ మెగా టోర్నీలో తొలి ఓటమిని చూసింది భారత్‌. అయితే టీమిండియా ఓటమి పాలు కావడంతో అవాంఛిత వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది.

ఇప్పటివరకూ భారత్‌ జట్టు 972 వన్డేలు ఆడగా, అందులో 505 విజయాల్ని సాధించగా, 418 పరాజయాల్ని ఎదుర్కొంది. ఇక 40 మ్యాచ్‌లు రద్దు కాగా, 9 మ్యాచ్‌లు టైగా ముగిశాయి. ఇక‍్కడ భారత్‌ విజయాల శాతం 54.66గా ఉంది. ఇది మూడో అత్యుత్తమం. కాగా, భారత్‌ జట్టు వన్డే పరాజయాల సంఖ్య 418కి చేరడంతో ఒక ‘వరల్డ్‌ రికార్డు’ కూడా వచ్చి చేరింది. వన్డే చరిత్రలో అత్యధిక పరాజయాలు చవిచూసిన జట్టు భారత్‌ నిలిచింది. ఈ జాబితాలో శ్రీలంకతో కలిసి భారత్‌ సంయుక్తంగా అగ్రస్థానానికి చేరింది.


 

>
మరిన్ని వార్తలు