భారత్‌ (VS) పాకిస్తాన్‌ 

23 Jun, 2018 01:02 IST|Sakshi

నేటి నుంచి చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ

బ్రెడా (నెదర్లాండ్స్‌): చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడేందుకు భారత పురుషుల హాకీ జట్టు సిద్ధమైంది. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌ తొలి మ్యాచ్‌లో శనివారం పాకిస్తాన్‌తో తలపడనుంది. ప్రపంచంలో మేటి ఆరు జట్లు బరిలో దిగనున్న ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ర్యాంకింగ్స్‌ పరంగా చూసుకుంటే పాకిస్తాన్‌ (13) కంటే భారత్‌ (6) మెరుగ్గా ఉంది.

‘టోర్నీలో శుభారంభం ముఖ్యం. పాకిస్తాన్‌ కూడా ఇతర ప్రత్యర్థి లాగే. నేటి మ్యాచ్‌లో భావోద్వేగాలకు తావులేదు’ అని చీఫ్‌ కోచ్‌ హరేంద్ర సింగ్‌ అన్నారు. మరోవైపు అనుభవజ్ఞులు, యువకులతో కూడిన పాకిస్తాన్‌ జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గత కొంత కాలంగా భారత మాజీ కోచ్‌ ఓల్ట్‌మన్స్‌ శిక్షణలో ఆ జట్టు రాటుదేలింది.  
సాయంత్రం గం. 5.30 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

మరిన్ని వార్తలు