రెండో జట్టుగా టీమిండియా..

20 Mar, 2018 11:32 IST|Sakshi

కొలంబో:శ్రీలంకలో ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దినేశ్‌ కార్తీక్‌ ఆఖరి బంతికి సిక్స్‌గా మలచి భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఇది బంగ్లాదేశ్‌పై భారత్‌కు వరుసగా ఎనిమిదో విజయం. ఫలితంగా అంతర్జాతీయ టీ 20 ల్లో ఒక ప్రత్యర్థిపై అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రెండో జట్టుగా టీమిండియా స్థానం సంపాదించింది.

2009-18 మధ్యకాలంలో బంగ్లాదేశ్‌పై వరుస టీ 20 విజయాల్ని భారత్‌ సాధించింది. దాంతో బంగ్లాదేశ్‌పై వరుసగా ఏడు విజయాలు సాధించిన పాకిస్తాన్‌ రికార్డును భారత్‌ సవరించింది.  అదే సమయంలో పొట్టి ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌పై ఇప్పటివరకూ భారత్‌ ఒక్క మ్యాచ్‌లో కూడా పరాజయం చెందకపోవడం మరో విశేషం. అయితే టీ 20ల్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన రికార్డు పాకిస్తాన్‌ పేరిట ఉంది.   2008-15 మధ్యకాలంలో జింబాబ్వేపై పాకిస్తాన్‌ వరుసగా 9 టీ 20 విజయాల్ని నమోదు చేసింది. ఆ తర్వాత రెండో జట్టుగా టీమిండియా నిలిచింది.

మరిన్ని వార్తలు