భారత్ ధీటైన జవాబు

12 Nov, 2016 08:29 IST|Sakshi
భారత్ ధీటైన జవాబు

రాజ్కోట్: ఇంగ్లాడుతో తొలి టెస్టులో మూడు రోజు భారత జట్టు సత్తా చాటింది. 63/0 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు  తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. కాగా తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 218 పరుగులు చేధించాల్సివుంది. భారత బ్యాట్స్‌మన్స్ లో ఛటేశ్వర పుజారా, మురళీ విజయ్ లు మూడో రోజు శతకాలతో అదరగొట్టారు.

పుజారా 124 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరగగా మరికొద్దిసేపు క్రీజులో నిలిచిన విజయ్(126) పరుగుల వద్ద ఔటయ్యాడు. మూడో రోజు ఆట ముగుస్తుందనగా విజయ్ వెనుదిరగడం భారత్ కు గట్టి దెబ్బే. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అమిత్ మిశ్రా కేవలం రెండు బంతులే ఎదుర్కొని వెనుదిరిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(23) పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్, సువర్ట్ బ్రాడ్, అదిల్ రషీద్, జాఫర్ అన్సారీలు తలో వికెట్‌ పడగొట్టారు. 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గౌతమ్ గంభీర్ ఎల్ బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

మరిన్ని వార్తలు