2016 తర్వాత టీమిండియా తొలిసారి..

25 Feb, 2019 12:02 IST|Sakshi

విశాఖపట్నం: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్‌ను విజయం ఊరించినట్లే ఊరించి ఉసూరుమనిపించింది. చివరిబంతి వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో ఆసీస్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి ఓవర్‌లో ఆసీస్‌ విజయానికి 14 పరుగులు కావాల్సిన తరుణంలో భారత్‌ విజయం ఖాయమనే అనిపించింది. కాగా, ఉమేశ్‌ యాదవ్‌ పేలవమైన బౌలింగ్‌తో ఆసీస్‌ గెలుపును అందుకుంది. అయితే టీమిండియా వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 2016 జూన్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌లో భారత్‌ వరుస రెండు మ్యాచ్‌లు కోల్పోవడం ఇదే తొలిసారి.

ఆస్ట్రేలియాతో తొలి టీ20కి ముందు న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరిదైన మూడో మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. ఆ తర్వాత తాజాగా విశాఖలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్‌ను పరాజయం వెక్కిరించింది. ఫలితంగా స్వదేశంలో జరిగిన చివరి ఎనిమిది టీ20ల్లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది.  మరొకవైపు టి20ల్లో భారత్‌పై చివరి బంతికి ప్రత్యర్థి జట్టు నెగ్గడం ఇది నాలుగోసారి. అంతకుముందు  న్యూజిలాండ్‌ (2009),  శ్రీలంక (2010), ఇంగ్లండ్‌ (2014)ఈ ఘనత సాధించాయి.    

ఇక్కడ చదవండి: గెలుపు గోవిందా

బుమ్రా బంతి.. వాహ్‌!

మరిన్ని వార్తలు