2022 మహిళల ఆసియా కప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం

6 Jun, 2020 03:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘ఆసియా కప్‌ మహిళల పుట్‌బాల్‌ టోర్నీ’ ఆతిథ్య హక్కులు 41 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కాయి. 2022లో నిర్వహించనున్న ఈ టోర్నీకి భారత్‌ వేదికగా నిలువనుందని ఆసియా ఫుట్‌బాల్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఎఫ్‌సీ) శుక్రవారం ప్రకటించింది. ‘ఏఎఫ్‌సీ మహిళల పుట్‌బాల్‌ కమిటీ సిఫార్సుల మేరకు టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌కు కట్టబెడుతున్నాం’ అని ఏఎఫ్‌సీ కార్యదర్శి డాటో విండ్సర్‌ జాన్‌ తెలపారు. భారత్‌ చివరిసారి 1979లో ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఈ అవకాశమిచ్చిన ఎఎఫ్‌సీకి ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ కృతజ్ఞతలు తెలిపారు.

దేశంలో మహిళల ఫుట్‌బాల్‌ అభివృద్ధికి, ఔత్సాహిక ఫుట్‌బాలర్లను ప్రోత్సహించేందుకు ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడనుందని ఆయన పేర్కొన్నారు. 12 జట్లు తలపడనున్న ఈ టోర్నీలో ఆతిథ్య దేశం హోదాలో భారత్‌ నేరుగా అర్హత పొందుతుంది. 2023లో జరుగనున్న ‘ఫిఫా’ మహిళల ప్రపంచకప్‌ టోర్నీకి ఇదే అఖరి క్వాలిఫికేషన్‌ ఈవెంట్‌ కావడం గమనార్హం. 

మరిన్ని వార్తలు