సొంతగడ్డపై భారత్‌ ‘గురి’ అదిరేనా

24 Feb, 2017 00:43 IST|Sakshi
సొంతగడ్డపై భారత్‌ ‘గురి’ అదిరేనా

► నారంగ్, జీతూరాయ్‌లపై ఆశలు
► నేటి నుంచి ప్రపంచకప్‌ షూటింగ్‌

న్యూఢిల్లీ: రియోలో నిరాశపరిచిన భారత షూటర్లు సొంతగడ్డపై జరిగే మెగా ఈవెంట్‌లో పతకాలపై గురిపెట్టారు. శుక్రవారం నుంచి జరిగే ప్రపంచకప్‌ షూటింగ్‌లో సత్తాచాటేందుకు సిద్ధమయా్యరు. ఇక్కడి డాక్టర్‌ కర్నిసింగ్‌ షూటింగ్‌ రేంజ్‌లో పది రోజుల పాటు ఈ పోటీలు జరుగనున్నాయి. భారత మేటి షూటర్లు గగన్  నారంగ్, జీతూరాయ్, హీనా సిదు్ధలపై భారత్‌ ఆశలు పెట్టుకుంది. 1999 తర్వాత... ఒలింపిక్‌ చాంపియన్ , భారత స్టార్‌ షూటర్‌ అభినవ్‌ బింద్రా లేకుండా భారత బృందం తలపడుతున్న తొలి ప్రపంచకప్‌ ఇదే కావడం గమనార్హం.

ప్రయోగాత్మక ఈవెంట్లకు ఈ ప్రపంచకప్‌ వేదికైంది. మహిళల ప్రాతినిధ్యం పెంచాలనే లక్ష్యంతో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ సిఫార్సు చేసిన మిక్స్‌డ్‌ జెండర్‌ (మహిళా, పురుషులు కలిసి ఆడే పోటీలు) ఈవెంట్లను తొలిసారిగా ఈ టోర్నీలోనే పరిశీలించనున్నారు. 50 దేశాలకు చెందిన 452 మంది షూటర్లు ఈ టోర్నీ బరిలోకి దిగుతున్నారు. ఆతిథ్య భారత్‌ నుంచి 63 మంది షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయా్యరు.

భారత్‌లో గతంలోనూ ప్రపంచకప్‌ షూటింగ్‌ ఈవెంట్లు (1997, 2000, 2003) జరిగినప్పటికీ ఈ ఈవెంట్‌ మాత్రం ప్రత్యేకవైుంది. ఇప్పటిదాకా భారత్‌లో జరిగిన మెగా ఈవెంట్లన్నీ కేవలం షాట్‌గన్  పోటీల (ట్రాప్, డబుల్‌ ట్రాప్, స్కీట్‌)కు మాత్రమే పరిమితం కాగా... తాజా ప్రపంచకప్‌లో రైఫిల్, పిస్టల్, షాట్‌గన్  ఇలా అన్ని కేటగిరీల్లో పోటీలు నిర్వహించనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌ (2020)కు ఇది తొలి క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ కావడం మరో విశేషం.

ఈ ఈవెంట్లలో చివరిసారిగా...
అంతర్జాతీయ షూటింగ్‌ సమాఖ్య త్వరలోనే కొన్ని ఈవెంట్లను ఒలింపిక్‌ క్యాలెండర్‌ నుంచి తొలగించనుంది. పురుషుల డబుల్‌ ట్రాప్, 50 మీ. పిస్టల్, 50 మీ. ప్రోన్‌ ఈవెంట్లు ఈ జాబితాలో ఉన్నాయి. మును్మందు ఇందులో పోటీపడే అవకాశం లేదని తెలిసినా... ఆఖరి సారిగా ప్రపంచకప్‌లో ఆయా ఈవెంట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు షూటర్లు బరిలోకి దిగుతున్నారు.

కొత్తగా మిక్స్‌డ్‌ జెండర్‌ ఈవెంట్స్‌
యూరోపియన్ పియన్ ప్, జూనియర్‌ ప్రపంచకప్, యూత్‌ ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టిన మిక్స్‌డ్‌ జెండర్‌ పోటీలను తొలిసారిగా ఓ మేజర్‌ టోర్నమెంట్‌లో ఆడిస్తున్నారు. ఇందులో భాగంగా 10 మీ. ఎయిర్‌ రైఫిల్, 10 మీ. ఎయిర్‌ పిస్టల్, ట్రాప్, స్కీట్‌ ఈవెంట్లలో పురుషులు, మహిళలు కలిసి గురిపెటా్టల్సి వుంటుంది. అయితే ఇది పూర్తిస్థాయి పోటీలు కాకపోవడం... ప్రయోగాత్మక పరిశీలన నేపథ్యంలో ఇందులో గెలిచిన వారికి పతకాల బదులు బ్యాడ్జిలు అందజేస్తారు.

మరిన్ని వార్తలు