సిరీస్ గెలిచినా.. పాయింట్లు కోల్పోయారు!

8 Jul, 2017 13:34 IST|Sakshi
సిరీస్ గెలిచినా.. పాయింట్లు కోల్పోయారు!

దుబాయ్: వెస్టిండీస్ తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను భారత్ 3-1తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. చివరి వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించడంతో సిరీస్ భారత్ సొంతమైంది. అయితే విరాట్ సేన సిరీస్ ను గెలిచినప్పటికీ పాయింట్లను మాత్రం కోల్పోయింది. ఈ సిరీస్ తరువాత విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ మూడో స్థానం నిలబెట్టుకుంది. కాగా, రెండు పాయింట్లను నష్టపోయింది.

 

విండీస్ తో వన్డే సిరీస్ కు ముందు 116 రేటింగ్ పాయింట్లతో బరిలోకి దిగిన భారత్ జట్టు.. సిరీస్ ముగిసిన తరువాత 114 పాయింట్లకు పడిపోయింది. విండీస్ తో జరిగిన నాల్గో వన్డేలో భారత్ జట్టు ఓటమి పాలుకావడం పాయింట్ల కోల్పోవడానికి ప్రధాన కారణమైంది. అయితే తన స్థానాన్ని మాత్రం టీమిండియా తిరిగి నిలబెట్టుకుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 119 రేటింగ్ పాయింట్లతో తొలిస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 117 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక ఇంగ్లండ్ 113 పాయింట్లతో నాల్గో స్థానానికి పరిమితమైంది.

 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా