రసవత్తరంగా రెండో టెస్టు

2 Oct, 2016 14:54 IST|Sakshi
రసవత్తరంగా రెండో టెస్టు

కోల్కతా:భారత-న్యూజిలాండ్ల మధ్య ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 204 పరుగులకు ఆలౌటైతే..  భారత తన రెండో ఇన్నింగ్స్ లో 106 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. దాంతో భారత్ ప్రస్తుతం 222 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆదిలోనే తడబడింది.

 

భారత ఆటగాళ్లలో మురళీ విజయ్(7), చటేశ్వర పూజారా(4), శిఖర్ ధవన్(17), అజింక్యా రహానే(1) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. దాంతో భారత్ 43 పరుగులకే నాలుగు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో కెప్టెన్ విరాట్ కోహ్లి-రోహిత్ శర్మల జోడి ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి ఐదో వికెట్ కు 48 పరుగులు జోడించిన తరువాత విరాట్(45;65 బంతుల్లో 7 ఫోర్లు) నిష్క్రమించాడు. ఆపై రవి చంద్రన్ అశ్విన్(5) అవుట్ కావడంతో టీ విరామానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు