కష్టాల్లో టీమిండియా

17 Sep, 2017 14:57 IST|Sakshi
కష్టాల్లో టీమిండియా

చెన్నై:ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే ఆరంభంలోనే  టీమిండియా కష్టాల్లో పడింది. 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్ ను అజింక్యా రహానే, రోహిత్ శర్మలు ఆరంభించారు. అయితే కౌల్టర్ నైల్ వేసిన నాల్గో ఓవర్ మూడో బంతికి రహానే(5) తొలి వికెట్ గా అవుటయ్యాడు. వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆపై కౌల్టర్ నైల్ వేసిన ఆరో ఓవర్ మూడో బంతికి కెప్టెన్ కోహ్లి పరుగులేమీ చేయకుండా రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు.

 

ఆసీస్ ఆటగాడు మ్యాక్స్ వెల్ అద్భుతమైన క్యాచ్ తో కోహ్లికి షాకిచ్చాడు.ఆపై సెకండ్ డౌన్ లో దిగిన మనీష్ పాండే ఆడిన రెండో బంతికే అవుటయ్యాడు. దాంతో తొలి మూడు వికెట్లను కౌల్టర్ నైల్ తన ఖాతాలో వేసుకున్నాడు. పది ఓవర్లు ముగియకుండానే మూడు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా శిబిరంలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. మరొకవైపు ఆసీస్ జట్టు ఆనందం వెల్లివిరిసింది. కాగా, జట్టు స్కోరు 64 పరుగుల వద్ద రోహిత్ శర్మ(28) నాల్గో వికెట్ గా పెవిలియన్ చేరాడు.

>
మరిన్ని వార్తలు