లార్డ్స్‌ టెస్ట్‌: మళ్లీ సున్నాకే వికెట్‌

12 Aug, 2018 16:35 IST|Sakshi

మురళీ విజయ్‌ డకౌట్‌

396/7 ఇంగ్లండ్‌ డిక్లేర్‌

లండన్‌ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా మళ్లీ సున్నాకే తొలి వికెట్‌ కోల్పోయింది. మురళీ విజయ్‌ రెండో ఇన్నింగ్స్‌లోను డకౌట్‌గా నిష్క్రమించాడు. తొలి ఇన్నింగ్స్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయిన విజయ్‌ రెండో ఇన్నింగ్స్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. రెండు సార్లు జేమ్స్‌ అండర్సన్‌ బౌలింగ్‌లోనే వికెట్‌ కోల్పోవడం విశేషం. ఇది అండర్సన్‌కు లార్డ్స్‌లో 100 వికెట్‌ కాగా.. ఓవరాల్‌గా టెస్టుల్లో 550వ వికెట్‌. 

ఇక ఇంగ్లండ్‌ 396/7 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ ఇచ్చింది. 357 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ మరో 39 పరుగులు జోడించి కరన్‌ (40) వికెట్‌ అనంతరం కోహ్లిసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కరన్‌ వికెట్‌ను హార్దిక్‌ పాండ్యా దక్కించుకున్నాడు. ఇక సెంచరీ హీరో క్రిస్‌ వోక్స్‌ (137) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్‌ భారత్‌పై 289 పరుగుల ఆధిక్యాన్ని సంపాధించింది. ఇక భారత్‌ మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే బ్యాట్స్‌మన్‌ క్రీజులో పాతుకుపోవాల్సిందే. వికెట్లు చేజార్చుకోకుండా డ్రా దిశగా ప్రయత్నం చేస్తేనే కోహ్లిసేన ఓటమి నుంచి గట్టెక్కగలదు.

చదవండి: కోహ్లి ఒక్కడి వల్ల కాదు: భజ్జీ

మరిన్ని వార్తలు