భారత్‌కు రెండో విజయం

18 Jun, 2017 01:13 IST|Sakshi
భారత్‌కు రెండో విజయం

లండన్‌: హాకీ వరల్డ్‌ లీగ్‌ (హెచ్‌డబ్ల్యూఎల్‌) సెమీఫైనల్స్‌ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. కెనడాతో శనివారం జరిగిన పూల్‌ ‘బి’ మ్యాచ్‌లో టీమిండియా 3–0తో గెలిచింది. భారత్‌ తరఫున ఎస్‌వీ సునీల్‌ (5వ నిమిషంలో), ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (10వ నిమిషంలో), సర్దార్‌ సింగ్‌ (18వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు.చస్కాట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 4–1తో నెగ్గిన సంగతి విదితమే. వరుసగా రెండు విజయాలతో భారత్‌కు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ దాదాపు ఖాయమైనట్టే.

నేడు పాక్‌తో పోరు...
ఒకవైపు లండన్‌లో చాంపియన్స్‌ ట్రోఫీలో ఆదివారం భారత్, పాక్‌ క్రికెట్‌ జట్లు టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకోనుండగా... అదే నగరంలో భారత్, పాకిస్తాన్‌ హాకీ జట్లు నేడు లీగ్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇప్పటివరకు భారత్, పాక్‌ హాకీ జట్లు 167 మ్యాచ్‌ల్లో తలపడగా... భారత్‌ 55 మ్యాచ్‌ల్లో, పాక్‌ 82 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 30 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. భారత్‌ 324 గోల్స్,  పాక్‌ 388 గోల్స్‌ సాధించాయి.

నేటి సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు