ఇలా అయితే ఎలా?: యువరాజ్‌ సింగ్‌

14 Jul, 2019 15:33 IST|Sakshi

న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా తన ప్రస్థానాన్ని సెమీస్‌లోనే ముగించడంపై మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ పెదవి విప్పాడు. భారత జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ సరిగా లేకపోవడం వల్లే టైటిల్‌ పోరుకు అర్హత సాధించడంలో విఫలమైందన్నాడు. ప్రధానంగా నాల్గో స్థానంలో నాణ్య‌మైన బ్యాట్స్‌మన్ లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ ఓట‌మి ఎదురైంద‌ని తాను భావిస్తున్నాన‌ని అన్నాడు. ఈ స్థానాన్ని ఎంత త్వ‌ర‌గా భ‌ర్తీ చేస్తే.. అంత మంచిద‌ని చెప్పారు. ఓ మంచి బ్యాట్స్‌మెన్‌తో ఈ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌క‌పోతే.. బ్యాటింగ్ లైన‌ప్ మ‌రింత బ‌ల‌హీన‌ప‌డే ప్ర‌మ‌దం ఉంద‌న్నాడు. సీనియర్‌ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి అర్ధాంత‌రంగా త‌ప్పుకోవ‌డం ప‌ట్ల యువ‌రాజ్ సింగ్ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశాడు. ప్రపంచ‌క‌ప్ టోర్న‌మెంట్ కోసం ఎంపిక చేసిన జ‌ట్టులో అంబ‌టి రాయుడిని తీసుకోక‌పోవ‌డం వ్యూహాత్మ‌క త‌ప్పిద‌మ‌ని యువీ వ్యాఖ్యానించాడు.

టీమిండియా బ్యాటింగ్ లైన‌ప్‌లో నాలుగో స్థానం అత్యంత కీల‌క‌మైనద‌ని యువ‌రాజ్ సింగ్ అన్నాడు. దీన్ని భ‌ర్తీ చేసుకోక‌పోతే.. దాని ప్ర‌భావం బ్యాటింగ్ లైన‌ప్ మొత్తంపై ప‌డుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. అంబ‌టి రాయుడిని జ‌ట్టులోకి తీసుకుని- నాలుగో నంబ‌ర్ స్థానాన్ని అత‌నితో భ‌ర్తీ చేయించి ఉండాల్సింద‌ని చెప్పాడు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో అంబ‌టి రాయుడికి చోటు ద‌క్క‌క‌పోవ‌డం త‌న‌ను షాక్‌కు గురి చేసింద‌ని అన్నాడు. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ అయినా ఈ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి విఫ‌ల‌మైతే.. అత‌ణ్ని ప‌క్క‌న‌పెడుతున్నార‌ని, అది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌న్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాల్గో స్థానాన్ని ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించాడు.

టీమిండియాలో నాలుగో నంబ‌ర్ స్థానం మ్యూజిక‌ల్ ఛైర్‌లా మారింద‌ని యువరాజ్ సింగ్ విమ‌ర్శించాడు. నాలుగైదు మ్యాచ్‌ల్లో విఫ‌ల‌మైన త‌రువాత అంబ‌టి రాయుడు న్యూజిలాండ్‌పై జ‌రిగిన మ్యాచ్‌లో రాణించాడ‌ని, మ‌ళ్లీ అత‌ణ్ని త‌ప్పించార‌ని మండిపడ్డాడు. తాజాగా రిష‌బ్ పంత్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తున్న‌ప్ప‌టికీ.. అత‌ను ఎన్నాళ్లు  ఆ స్థానంలో ఉంటాడో తెలియ‌ద‌ని అన్నాడు. నాలుగో స్థానంలో ఆడ‌గ‌ల‌డ‌న్న న‌మ్మ‌కం ఉంచిన ఓ ఆట‌గాడిని మ‌ళ్లీ, మ‌ళ్లీ తొల‌గించ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌ద‌ని చెప్పాడు. దీనివ‌ల్ల ఆ ఆట‌గాడు త‌న‌పై తాను విశ్వాసాన్ని కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని యువ‌రాజ్ సింగ్ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు

ఇంగ్లాండ్‌ అలా గెలిచిందట.!

సారీ న్యూజిలాండ్‌...

లార్డ్స్‌ నుంచి లార్డ్స్‌ వరకు...

ప్రపంచ కల నెరవేరింది