కోహ్లి అండ్ గ్యాంగ్కు మూడో ర్యాంకు

1 May, 2017 16:54 IST|Sakshi
కోహ్లి అండ్ గ్యాంగ్కు మూడో ర్యాంకు

దుబాయ్: ఆంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా మూడో ర్యాంకుకు ఎగబాకింది. తాజా వన్డే ర్యాంకింగ్స్ లో ఒక ర్యాంకు మెరుగుపరుచుకున్న కోహ్లి సేన మూడో స్థానాన్ని దక్కించుకుంది. మరొకవైపు దక్షిణాఫ్రికా ప్రథమస్థానాన్నినిలబెట్టుకోగా, ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. టీమిండియా 117 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానాన్ని సాధించగా, 123 పాయింట్లతో దక్షిణాఫ్రికా టాప్ లో నిలిచింది. కాగా, ఆస్ట్రేలియా 118 పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇక్కడ ఆస్ట్రేలియా కంటే కోహ్లి సేనకు ఒక పాయింట్ మాత్రమే తక్కువ ఉండటం గమనార్హం.

ఇక పాకిస్తాన్ 88 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలవగా, వెస్టిండీస్ 79 రేటింగ్ పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక్కడ పాకిస్తాన్ 90 నుంచి 88 రేటింగ్ పాయింట్లకు పడిపోగా, వెస్టిండీస్ 83 రేటింగ్ పాయింట్ల నుంచి 79 పాయింట్లకు పడిపోయింది.


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు