టీమిండియా సిరీస్‌ గెలిస్తేనే..

5 Feb, 2018 12:36 IST|Sakshi
దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో రాణించిన కుల్దీప్‌ యాదవ్‌ను అభినందిస్తున్న సహచరులు

కేప్‌టౌన్‌:దక్షిణాఫ్రికాతో ఆరు వన్డేల సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం సెంచూరియన్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో విరాట్‌  కోహ్లి నేతృత్వంలోని భారత్‌ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో వన్డేల్లో నంబర్‌ స్థానాన్ని భారత్‌ ఆక్రమించింది. తాజా గెలుపుతో 121 రేటింగ్‌ పాయింట్లతో టీమిండియా ప్రథమ స్థానంలో నిలవగా, దక్షిణాఫ్రికా 115 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది.

అయితే నంబర్‌ వన్‌ ర్యాంకును కాపాడుకోవాలంటే సఫారీలతో సిరీస్‌ను కచ్చితంగా గెలవాల్సి ఉంది. వన్డే సిరీస్‌ను భారత్‌ జట్టు 4-2తో ముగించిన పక్షంలో టాప్‌ ర్యాంక్‌ పదిలంగా ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా సఫారీలు సిరీస్‌ సాధిస్తే మాత్రం భారత జట్టు రెండో ర్యాంక్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టు టెస్టుల్లో కూడా నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతుండగా, దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది.

మరిన్ని వార్తలు